ఈడీపై సుప్రీం ఆగ్రహం
Breaking News
తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్
Published on Mon, 08/29/2022 - 09:25
సాక్షి, అమరావతి: వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. 'వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2022
చదవండి: (YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం)
Tags : 1