Breaking News

‘దిశ’ ప్రాజెక్టుపై సమీక్ష: సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published on Fri, 07/02/2021 - 16:06

సాక్షి, అమరావతి: దిశ కాల్‌సెంటర్లలో అదనపు సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న ఆయన.. దిశ పెట్రోలింగ్ కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ శుక్రవారం ‘దిశ’ ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు త్వరగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, విశాఖలో ల్యాబ్‌ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇక ఫొరెన్సిక్ ల్యాబ్‌ల్లో ఇప్పటికే 58 పోస్టుల భర్తీకాగా... మరో 61 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు.

అదే విధంగా గంజాయి రవాణా, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో.. నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో... ప్రీతి సుగాలి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో... తీసుకునే చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ‘‘ప్రీతి సుగాలి తండ్రికి ఉద్యోగం ఇస్తున్నాం. ప్రీతి తల్లి కోరుకున్నట్లే ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నాం. 5 సెంట్ల ఇంటి పట్టా, ఐదెకరాల భూమిని కూడా ఇస్తున్నాం’’ అని ముఖ్యమంత్రికి తెలిపారు.

Videos

భయం భక్తి లేదా.. పెరోల్ కథా చిత్రం.. దోచుకో రాధా

ABN రాధాకృష్ణ రుణం తీర్చుకోవాలి

భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త

సంపద సృష్టి అని అప్పుల ఏపీగా మార్చేశారు..!

ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా హాలీవుడ్ రేంజ్ లో రామాయణం

చింతమనేని రెడ్ బుక్ అరాచకాలు.. నా కొడుకుని వదిలేయండి..

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స

Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్

తమ్మినేని సీతారాం హౌస్ అరెస్ట్... ఆముదాలవలసలో ఆందోళన

Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!

Photos

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 24-31)

+5

పుష్ప మూవీ ఫేమ్ జాలి రెడ్డి బర్త్‌ డే.. సతీమణి స్పెషల్ విషెస్‌ (ఫొటోలు)

+5

కాబోయే మరదలితో రిబ్బన్‌ కట్‌ చేసిన సారా.. సచిన్‌ పుత్రికోత్సాహం (ఫొటోలు)

+5

పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)