Breaking News

రైతులకు ఏమి కావాలో వారినే అడిగి అందజేస్తాం: సీఎం జగన్‌

Published on Fri, 06/02/2023 - 10:59

సాక్షి, చుట్టుగుంట: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు.  దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్‌ పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం సీఎం జగన్‌ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘రైతన్నకు అండగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ఉంది. ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించాం. ఇ‍ప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. రైతు గ్రూపులకు కొత్తగా రూ. 361.29కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను అందించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15లక్షలు కేటాయించాం.

ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, ఏమి అవసరమో వారినే అడిగి అందజేస్తాం. అందులో భాగంగానే వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం’ అని అన్నారు. 

ఇది కూడా చదవండి: వైఎస్సార్‌ బీమా నమోదు ప్రారంభం

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)