Breaking News

టీడీపీ ఎంపీటీసీ కుటుంబానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ 

Published on Mon, 02/26/2024 - 05:05

జరుగుమల్లి: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే క్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరోమారు రుజువయింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎడ్లూరపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ బత్తిన మోహనరావు (53) బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి గురై అనేక ఆస్పత్రులకు తిరిగి దాదాపు రూ. 30 లక్షల వరకు ఖర్చుచేశారు. అయినా ఫలితం లేక గతేడాది నవంబర్‌లో మరణించారు. ధుఃఖంలో ఉన్న మోహనరావు కుటుంబానికి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పార్టీలకు అతీతంగా అండగా నిలిచారు. స్థానిక నాయకులు చుండి శ్రీనివాసరావు, చుండూరి సురేష్‌ ఈ విషయాన్ని మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 19న మోహనరావు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.  

మానవత్వంతో ఆదుకున్నారు  
మా పెదనాన్న గత ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనారోగ్యానికి గురవడంతో పలు ఆస్పత్రులకు తిప్పి మా శక్తికి మించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాం. అయినా ఆయన మాకు దక్కలేదు. ఆ సమయంలో స్థానిక నాయకులు, మంత్రి సురేష్‌ పార్టీలు చూడకుండా మానవత్వంతో మాకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.8 లక్షలు మంజూరు చేయించి ఇచ్చారు.  – బత్తిన శరత్‌బాబు, మృతుని తమ్ముని కుమారుడు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)