నా సంగతి మీకు తెలీదు.. తనిఖీలు ఆపి వెంటనే వెళ్లండి

Published on Fri, 04/05/2024 - 04:57

చోడవరం: ‘ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఎవరు పంపిస్తే వచ్చారో నాకు తెలుసు. అసలు ఇలాంటి షాపుల్లో తనిఖీలు చేయాలని మీకు ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద మాల్స్‌ను వదిలేసి ఇలాంటివాటిపై పడతారా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్లకపోతే బాగుండదు. నా సంగతి మీకు తెలీదు’ అంటూ అనకాపల్లి టీడీపీ, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీ.ఎం. రమేష్‌ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై తన అనుచరులతో కలసి దౌర్జన్యానికి దిగారు.

వారి చేతిలో ఉన్న ఫైళ్లు లాక్కుని వారిపై విరుచుకుపడి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఒక దశలో అధికారుల చేతులను తోసేసి గూండాయిజం చేశారు. ఏక వచనంతో సంబోధించి అధికారులపై బెదిరింపులకు తెగబడ్డారు. తానేంటో... తన సహజ ధోరణి ఏంటో ఈ సంఘటన ద్వారా ఆయన స్థానికులకు రుచిచూపించారు.

ప్రశాంతమైన అనకాపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ చూడని అక్కడి ప్రజలు ఆయన రౌడీయిజం చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. ఇప్పుడే ఈయన ప్రవర్తన ఇలా ఉంటే ఇక ఆయన్ని గెలిపిస్తే ఇక తమను బతకనిస్తారా అంటూ అక్కడివారు గుసగుసలాడుకోవడం వినిపించింది. చోడవరం మండలం గాంధీ గ్రామంలో గురువారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  



జీఎస్టీ రికార్డులు తనిఖీ చేస్తుండగా... 
గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్‌సేల్‌ టైల్స్, మార్బుల్స్‌ వ్యా­పా­రం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్‌ ఆఫ్‌ రెవె­న్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం(డీఆర్‌ఐ) అధి­కారి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్‌ వ్యాపారి బుచ్చి­రాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజే­పీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఫోన్‌ చేశారు.

వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్‌ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్‌ లాక్కు­న్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎ­లా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి ది­గా­రు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు.  

టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు 
తన వెంట తీసుకొచ్చిన కార్యకర్తలను రెచ్చగొట్టి, దౌర్జన్యానికి మరింత పురిగొల్పేలా ప్రవర్తించా­రు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, స్థానిక ఎమ్మెల్యేపైనా విమర్శలు చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇంతలో సమాచారం అందుకున్న స్థానిక పోలీసు సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు వచ్చాక కూడా సీఎం రమేష్‌ అధికారులను బెదిరించడం మానలేదు. దాడు­లు ఆపే వరకూ ఇక్కడే ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు.

తమ షాపు అద్దాలను అధికారులు పగలగొట్టారని, కౌంటర్‌లో ఉన్న  రూ.25 లక్షలు నగదు తీసుకున్నారంటూ షాపు యజ­మా­ని బుచ్చి­రాజు సీఎం రమే‹Ùకు చెప్పడం, ఆయన అధికారులపై మరింత రెచ్చిపోయి ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు మాత్రం తనిఖీలు ఆపబోమని చెప్పగా.. పరిస్థితి అదుపు తప్పేట్టు వుందని స్థానిక పోలీసులు చెప్పడంతో డీఆర్‌ఐ అధికారుల బృందం అక్కడ నుంచి వెళ్లిపోయింది. 

పోలీసులకు ఫిర్యాదు  
జరిగిన సంఘటనపై డీఆర్‌ఐ అధికారులు చోడవరం పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యా­దు చేశారు. అనకాపల్లి డీఎస్‌పీ అప్పలరాజు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి, చోడవరం పోలీసు స్టేషన్‌లో డీఆర్‌ఐ అధికారులతో మాట్లాడారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్నడూ ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలు చూడని స్థానికులు సీఎం రమేష్‌ ప్రవర్తనపై ఏవగించుకున్నారు.డ్యూటీకి అడ్డురావద్దని కోరినా.. తమ డ్యూటీ తమను చేసుకోనివ్వాలని డీఆ­ర్‌ఐ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారిపై గూండాగిరీ ప్రదర్శించా­రు.

అసలు ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అంటూ అధికారులపై రుబాబు చేశారు. ఒక దశలో డీఆర్‌ఐ అధికారి చేయిని సీఎం రమేష్‌ తోసేసి మరీ హెచ్చరించారు. దాడు­లు ఆపేసి వెనుదిరిగి వెళ్లే వరకూ తాము ఇక్కడ నుంచి వెళ్లబోమంటూ భీషి్మంచుకొని కూర్చున్నారు. అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ అధికారులను నానా దుర్భాషలాడారు.

తమ డ్యూటీని అడ్డుకోవడం సరికాదని, ఎవరి ఒత్తిళ్ల­తో తాము తనిఖీలకు రాలేదని, తమ విధి నిర్వహణలో భాగంగానే వచ్చామని అధికారులు ఎంత చెబుతున్నా వినకుండా అధికారులను బెదిరించి పెద్దపెద్దగా అరుస్తూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ఆయన ప్రవర్తనతో హతాశులైన అధికారులు భయబ్రాంతులకు గురయ్యారు. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)