Breaking News

నేడు ‘కళ్యాణమస్తు, షాదీ తోఫా’ నగదు జమ

Published on Thu, 05/04/2023 - 20:04

సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ నగదు జమ చేయనున్నారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో సీఎం జగన్‌ నగదు జమ చేస్తారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగినట్టవుతుంది. వీరి ఖాతాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. 

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా.. 
‘పిల్లల చదువు ఇంటికి వెలుగు– ఇల్లాలి చదువు వంశానికే వెలుగు’ అనే మాటను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓవైపు పేద కుటుంబాల్లోని చెల్లెమ్మల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది. మరోవైపు ప్రతి చెల్లెమ్మను, ప్రతి తమ్ముడిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, బాల్యవివాహాలను నివా­రిం­చడం, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవడం వంటి సమున్నత లక్ష్యాలతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని చెల్లెమ్మలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ చెల్లెమ్మలకు వైఎస్సార్‌ షాదీ తోఫాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది.  
చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ప్రకటన

పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.. 
కేవలం వందకు వంద శాతం అక్షరాస్యతే లక్ష్యంగా కాకుండా వందకు వంద శాతం గ్రాడ్యుయేట్‌లుగా పిల్లలను తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద సాయం పొందడానికి పదో తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది.  వధువుకు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని నిర్దేశించింది. ఇంటర్‌ వరకు జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు, జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్స్, జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల సాయం అందిస్తుండటంతో ఉన్నత చదువులు కూడా సాకారమవుతున్నాయి.  

చదవండి: AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’

నాడు.. 
గత టీడీపీ ప్రభుత్వంలో అరకొ­రగా కొన్ని వర్గాలకే ఆర్థిక సాయం అందేది. అది కూడా సకాలంలో అందరికీ అందేది కాదు. సాయం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఉండేది. అర్హులైన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ నెలల తరబడి జాప్యం చేసి 2018 అక్టోబర్‌ నుంచి ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తేసింది. 2018–19లో 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్ల వివాహ ప్రోత్సాహకాలను చెల్లించకుండా ఎగ్గొట్టింది.  

నేడు
నేడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. పేదల ఇంట్లో పెళ్లి కూడా ఆనందానుభూతులను మిగిల్చేలా, గత ప్రభుత్వంలో అందిస్తామని ఎగ్గొట్టిన సాయానికి దాదాపు రెట్టింపు ఆర్థిక సాయం.

దరఖాస్తు ఇలా.. 
వధూవరులు వివాహమైన 30 రోజుల్లోపు తమ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో వివరాలను ధ్రువీకరించుకుంటారు. ఏటా ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్‌ల్లో ఆయా త్రైమాసికాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తారు.

మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైనవారికి నిర్ధారించిన మేరకు ఆర్థిక సాయం చేస్తారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాల్లో, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)