Breaking News

ఫైనాన్షియల్‌ లిటరసీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి: సీఎం జగన్‌

Published on Fri, 01/12/2024 - 17:52

సాక్షి, గుంటూరు: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్ కుమార్‌, పాఠశాల విద్యాశాఖ(మౌలిక వసతులు కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది, అధికారులకు ఐబీ ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు సహా సిబ్బంది  శిక్షణ పొందనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యా బోధన ఒకటో తరగతితో ప్రారంభం కానుంది. ఐబీ.. జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనుంది.

ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష జరిపారు. ప్రతి మూడు పాఠశాలలకు ప్యూచర్‌ స్కిల్స్‌పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.. ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్‌లను వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గుర్తించామని వెల్లడించారు. వారికి గౌరవవేతనం చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఫ్యూచర్‌ స్కిల్స్‌ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్నీ త్వరగా పూర్తిచేయాలన్న సీఎం.. దీనిలో భాగంగా ఫైనాన్షియల్‌ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని.. దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని సీఎం అన్నారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్‌ స్కిల్స్‌ బోధించేందుకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ఇప్పటికే ఒక సెమిస్టర్‌కు సంబంధించి సిలబస్‌ రూపొందించామని అధికారులు వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)