Breaking News

ఇక ఊదండి బాకా

Published on Mon, 08/19/2024 - 05:39

శ్రీసిటీ (వరదయ్యపాళెం): డప్పు కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని మరోమారు స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే రాష్ట్రంలో పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్‌ ప్రచా­రం చేసుకునేందుకు వ్యూహం రూపొందించారు. శ్రీసిటీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి.. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రారం¿ోత్సవాలు చేసిన పరిశ్రమలకే మళ్లీ ప్రారం¿ోత్సవాలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. 

అంతా సిద్ధమైపోయాక సీఎం పర్యటనను ఖరారు చేశారు. దీంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమలకు ప్రారం¿ోత్సవాలు, భూమిపూజలు, ఎంఓయూలు మరోమారు చంద్రబాబు చేతుల మీదుగా చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 పరిశ్రమలకు నేడు ప్రారంభోత్సవాలు చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీసిటీ వస్తున్నారు. 

ఎల్‌ల్జీ పాలిమార్స్, నైడెక్, ఈప్యాక్‌ డ్యురబుల్స్, న్యుయోలింక్‌ టెలి కమ్యూనికేషన్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, జెన్‌లెనిన్‌ ఇంటర్నేషనల్, బెల్‌ ఫ్లెవర్స్, జేజిఎల్‌ మెటల్‌ కన్వర్టర్స్, త్రినాథ్‌ ఇండస్ట్రీస్, ఎవర్‌ షైన్‌ మౌల్డర్స్, ఆటో డేటా, ఈఎస్‌ఎస్‌ కీ కాంపొనెంట్స్, అడ్మైర్‌ కేబుల్స్, బాంబై కోటెడ్‌ స్పెషల్‌ స్టీల్, శ్రీలక్ష్మీ ఆగ్రో ఫుడ్స్‌ పరిశ్రమలు గత ప్రభుత్వంలో ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. 

ఇప్పుడు వీటినే సీఎం మరోమారు ప్రారంభించనున్నారు. రూ.1,570 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలు ఏర్పాటయ్యా­యని ప్రచారం చేసుకోనున్నారు. మరో రూ.900 కోట్లతో ఇంకో 8 పరిశ్రమ­లకు భూమి పూజ, ఐదు పరిశ్రమలతో ఎంవోయూ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)