Breaking News

స్కిల్‌ స్కాం.. కేసు కొట్టివేతకు బాబు మాస్టర్‌ ప్లాన్‌!

Published on Tue, 12/23/2025 - 13:41

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తనపై ఉన్న కేసులను మూసివేసే ప్రక్రియలో చంద్రబాబు స్పీడ్‌ పెంచారు. ఇందులో భాగంగానే.. స్కిల్‌ స్కామ్‌ కేసు మూసివేతకు చురుకుగా ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ సీఐడీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది. పూర్తి సహకారం అందిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్‌ నెట్‌, రాజధానిలో అసైన్డ్‌ ల్యాండ్స్‌, లిక్కర్‌ కేసు, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్‌ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే స్కిల్‌ స్కాం కేసు మూసివేతకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్స్‌ కింద ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు, చంద్రబాబు అడుగులకు సీఐడీ కూడా మడుగులొత్తుతున్నది. స్కిల్‌ కేసు మూసివేతకు పూర్తి సహకారం అందిస్తోంది.

ఈ క్రమంలో క్లోజర్‌ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వచ్చి సమాధానం చెప్పాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో స్కిల్‌ స్కాం కేసును కూడా చంద్రబాబు త్వరగా మూసివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు.. 52 రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాంలో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేసేందుకు ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఫైబర్‌నెట్‌ కేసు క్లోజ్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)