Breaking News

సామర్థ్యం పెంపుపై ప్రభుత్వోద్యోగులకు శిక్షణ

Published on Thu, 05/08/2025 - 04:28

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ సామర్థ్యం పెంపుదలపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి కార్యదర్శి వరకు ప్రతిఒక్కరికీ దీనిపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్డీపీపై సీఎం బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  

వచ్చే నెలకల్లా నియోజకవర్గాల విజన్‌ ప్లాన్‌.. 
స్వర్ణాంధ్ర విజన్‌ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్ర­ణాళికలు ఇప్పటికే సిద్ధంకాగా.. నియోజకవర్గాల వా­రీ­గా విజన్‌ ప్లాన్‌ వచ్చేనెలకల్లా రూపొందించనున్నా­రు. పీ–4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ల­డానికి సీఎం చైర్మన్‌గా స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్‌ ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు.. జనాభా నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ తీసుకురానుంది.

స్పేస్‌–డిఫెన్స్‌ ప్రాజెక్టులకు నూతన పాలసీ.!
రాష్ట్రంలో అంతరిక్ష, రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై సీఎం చంద్రబాబు ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్‌ టెక్నాలజీ అడ్వయిజర్‌గా ఉన్న ఎస్‌.సోమనాథ్, డీఆర్డీవో మాజీ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్‌–డిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డితో చర్చించారు. స్పేస్‌–డిఫెన్స్‌ పాలసీల రూపకల్పనతో పాటు, ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందేలా చురుకైన పాత్ర పోషించాలని వారికి సూచించారు.   

Videos

నేడు రీజనల్ కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ కీలక సమావేశం

పసిడి ప్రియులకు గోల్డన్ ఛాన్స్... భారీగా తగ్గిన బంగారం ధరలు

నేను ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా.. CM రమేష్ కు అమర్నాథ్ ఛాలెంజ్

జనసేనకు మేయర్ పీఠం.. అనంతపురం అర్బన్ లో సీట్ ఫైట్

ఫ్యాన్ గర్ల్ కు అయ్యర్ సర్ ప్రైజ్ గిఫ్ట్

అనంతపురం జిల్లా కలెక్టర్ ను కలిసిన శైలజానాథ్.. ఎందుకంటే ?

Allu Arjun: AA23 అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే.?

సొంత నియోజకవర్గ IAS ఆఫీసర్ పై క్రిమినల్ కేసు నమోదు

జైల్లో 15 మంది YSRCP నేతలను కలిసిన తాటిపర్తి చంద్రశేఖర్

లింగమనేని రమేష్ కొడుకు కేసులో పోలీసుల మొద్దు నిద్ర

Photos

+5

సీఎం విజయ్‌ను కలిసిన విరోష్ జంట.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ ఫోటోలు!

+5

వైష్ణో దేవి ఆలయంలో హీరోయిన్ తమన్నా ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సుహాస్ కొత్త సినిమా 'హైడ్ & సిల్క్' లాంచ్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో ముద్దుముద్దుగా 'ఇరుముడి' పాప (ఫొటోలు)

+5

పట్టుచీరలో 'గరివిడి లక్ష‍్మి' ఆనంది (ఫొటోలు)

+5

కొంటెచూపుతో మాయ చేసేలా ప్రియా వారియర్ (ఫొటోలు)

+5

హీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు మేధ.. మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

హాలీడే ట్రి‍ప్‌లో హీరోయిన్ నయనతార ఫ్యామిలీ.. (ఫోటోలు)

+5

నవరాత్రి రెండో రోజు.. మా బ్రహ్మచారిని అవతారంలో వితికా శేరు.. (ఫోటోలు)

+5

పచ్చని అరటితోటలో యాంకర్ రష్మీ గ్లామరస్ లుక్స్.. (ఫోటోలు)