Breaking News

సీఎంవోలో సీనియర్‌ ఐఏఎస్‌కు అవమానమా?

Published on Sat, 07/20/2024 - 18:12

అమరావతి, సాక్షి: ఆయనో సమర్థవంతమైన ఐఏఎస్‌ అధికారి. డిప్యూటేషన్‌ మీద కేంద్రంలో కీలక శాఖల్లో పని చేసిన అనుభవమూ ఉంది. అయితే ఆయన సేవలు వాడుకుంటామంటూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఇప్పుడు ఖాళీగా కూర్చోబెట్టింది. 

ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేసేవారు. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా విధులు న్విహించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. సీఎం చంద్రబాబు కేంద్రానికి రిక్వెస్ట్‌ పెట్టారు. దీంతో.. కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. 

వచ్చిరాగానే సీఎం ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా, ఆ వెంటనే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హడావిడి చేశారు. అయితే.. తాజాగా సీఎంవోలోని అధికారులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి రవిచంద్ర ముద్దాడా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో  ముద్దాడా రవిచంద్ర, ప్రద్యుమ్న,  రాజమౌళి, కార్తికేయ మిశ్రాలకే శాఖల కేటాయింపు ఉంది. కానీ, పీయూష్‌ కుమార్‌కు మాత్రం ఏ శాఖను చంద్రబాబు కేటాయించలేదు. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)