Breaking News

ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నా

Published on Sat, 03/01/2025 - 03:31

సాక్షి, అమరావతి : ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, అందుకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడంలేదని, అలా నిర్లక్ష్యం చేస్తున్న వారి జాబితా తన వద్ద ఉందన్నారు.

ఎమ్మెల్యేలకు, కేడర్‌ మధ్య సమన్వయం లేకుండాపోయిందని తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని  వారికి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల గురించి ఆలోచించి వారికి మంచి చేయా­లని.. అందరినీ కలుపుకుని వెళ్లకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు. 

దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలి..
ఇక నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు వారిని ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వచ్చి ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. ఏప్రిల్‌లోపు నామినేటెడ్‌ పదవులను భర్తీచేస్తామన్నారు.  సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. 

అధికారులు తమ మాట వినడంలేదని, పోస్టింగ్‌ల విషయంలోనూ ఇబ్బందులున్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులివ్వాలని, ఏ చిన్న పనిచేయడానికి అవకాశం లేకుండాపోయిందని చెప్పారు. అవకాశాన్ని బట్టి నిధుల గురించి ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)