Breaking News

కేంద్రం సాయం చేస్తే.. కృష్ణా డెల్టా, సీమకు గోదావరి జలాలు

Published on Mon, 12/30/2024 - 04:26

సాక్షి, అమరావతి: గోదావరి వరద జలాలను బనకచర్ల హెడ్‌రెగ్యులేటరీకి తరలించడం ద్వారా ఏపీని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం దాదాపు రూ.80వేల కోట్లతో రూపొందించిన ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక పరిస్థితివల్ల చేపట్టే అవకాశంలేనందున కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తామన్నారు. 

ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏటా సముద్రంలో వృథాగా కలుస్తున్న దాదాపు 3వేల టీఎంసీల్లో 280 టీఎంసీలను తరలించడం ద్వారా అటు కృష్ణా డెల్టాకు ఇటు రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలిగిస్తామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించి నాగార్జునసాగర్‌ కుడికాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తీసుకెళ్తామన్నారు. 

200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి అక్కడ నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటరీకి తరలిస్తామని చంద్రబాబు చెప్పారు. అందుకోసం బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ. సొరంగం నిర్మించి నీటిని తరలిస్తామన్నారు. బనకచర్ల హెడ్‌ రెగ్యులేటరీ నుంచి తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, నిప్పుల వాగుకు నీళ్లు వెళ్తాయన్నారు. అక్కడ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తామన్నారు. తద్వారా జలహారం కింద రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నీటి అవసరాలను తీరుస్తామన్నారు. 

ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించడంతోపాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)