Breaking News

జమిలి ఎన్నికలకు మద్దతివ్వాలి

Published on Thu, 10/10/2024 - 05:26

సాక్షి, అమరావతి: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలపాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఉండ­వల్లిలోని తన నివాసంలో మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. హరియాణాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనమన్నారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందన్నారు. 

విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టం ఎక్కువని చెప్పారు. రాబోయే రోజుల్లో ఒక్క ఏపీలోనే రూ.75 వేల కోట్లను ఒక్క రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. బెంగ­ళూరు–చెన్నయ్‌–అమరావతి–హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాలను కలిపేలా బుల్లెట్‌ రైలు తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.   

కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చిస్తా 
విశాఖ రైల్వే జోన్, 90–95 రైల్వే బ్రిడ్జిలు, అండర్‌ బ్రిడ్జిలతోపాటు అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు, విజయవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణంపై కేంద్ర మంత్రులతో చర్చించానని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకూడదన్నారు. బీపీసీఎల్‌ ఆయిల్‌ రిఫైనరీ కోసం రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలిస్తున్నారని, దాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.  

వరద సాయం చాలామందికి వెళ్లలేదు 
వరద సాయం చాలామందికి వెళ్లలేదని చంద్రబాబు అన్నారు. చివరివరకూ సాయాన్ని అందించలేకపో­యామని ఒప్పుకున్నారు. కచ్చితంగా 5,10 శా­తం వేస్ట్‌ అవుతుందని, దానికి ఎవరూ ఏమీ చేయ­లే­రని తెలిపారు. 

అగ్గిపెట్టెలు ఇవ్వలేదనడం సిగ్గుచేటన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయాలనుకున్న వాళ్లు తమను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తిరుమల బ్రహ్మోత్స­వా­లు, దసరా ఉత్సవాలు ఎంతో కన్నుల పండువ­గా జరుగుతున్నాయని, గత ఐదేళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగాయా అని ప్రశ్నించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)