Breaking News

చంద్రబాబు ఉత్తరాంధ్ర జపం అంతా ఉత్తదే

Published on Tue, 08/04/2026 - 05:34

విశాఖ విద్య: ‘చంద్రబాబు నిత్యం ఉత్తరాంధ్ర పేరును జపించడం అంతా ఉత్తదే. వాస్తవానికి ఆయన ఆలోచలన్నీ అమరావతిని అభివృద్ధి చేయడంపైనే ఉన్నాయి. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డును అమరావతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి చంద్రబాబు లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం’ అని విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు ధ్వజమెత్తారు. లోక్‌సత్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ రైల్వే జోన్‌ ఎక్కడ ఉంటే అక్కడే ఆర్‌ఆర్‌బీ ఉండాలని, అలాకాకుండా ఆర్‌ఆర్‌బీని అమరావతిలో ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి లేఖ రాయడం దుర్మార్గమని మండిపడ్డారు.

కొందరికి మాత్రమే ఉపయోగపడే భోగాపురం విమానాశ్రయాన్ని చూపించి లక్షలాది మంది ఉత్తరాంధ్రకు చెందిన నిరుద్యోగులకు ఉపయోగపడే రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డును అమరావతికి ఎత్తుకుపోవడమేనా చంద్రబాబు తెలివితేటలు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో రైల్వే ఉద్యోగాల పరీక్షల కోసం ఒడిశాకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు ఉత్తరాంధ్ర యువతకు తెలుసని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటాల ఫలితంగానే రైల్వే జోన్‌ వచి్చందని, ఇప్పుడు ఆర్‌ఆర్‌బీ కోసం మరో ఉద్యమం అవసరమని స్పష్టంచేశారు.

విశాఖలో ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు కోసం సంతకాల సేకరణ చేపట్టాలని, ఉత్తరాంధ్రకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బా­బ్జీ, సీపీఐ నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి, ప­లు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)