Breaking News

చంద్రబాబు గేమ్‌.. అమరావతి నుంచి పేదలు ఔట్‌

Published on Mon, 08/05/2024 - 19:45

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్‌ గేమ్‌లో అమరావతిలోని పేదలకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలో ఆర్‌-5 జోన్‌ నుంచి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వేరే ప్రాంతాల్లో స్థలం ఇస్తామన్నారు.

కాగా, చంద్రబాబు పెత్తందారీ పాలనలో పేదలకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. అమరావతి నుంచి పేదలు వెళ్లిపోవాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు. రాజధానిలో ఆర్-5 జోన్ నుండి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. వారికి వేరే స్థలాలు ఇవ్వాలని సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు.. ఆర్‌-5 జోన్‌లోని లబ్ధిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే స్థలాలు ఇస్తాం. లబ్ధిదారుల కోసం భూమిని సేకరించాలి. లేదంటే భూసేకరణ చేయాలి. లేకుంటే టిడ్కో ఇళ్లు అయినా ఇస్తాం అని చెప్పుకొచ్చారు. ఇక, అమరావతి భూములపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

ఇక, ఇదే సమయంలో అమరావతి రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రోడ్లన్నీ పీపీపీ మోడల్‌లో చేపట్టాలి. పీపీపీ పద్దతిలో రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలి. ప్రైవేటుకు ఇస్తే రోడ్ల నిర్వహణ వారే చేస్తారు. గుంతలు ఏర్పడితే వారే పూడుస్తారు. అమరావతిలో ప్రత్యేకంగా పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)