Breaking News

అధికారులకు అడుగడుగునా అవమానాలు! అదే పనిగా పెట్టుకుని..

Published on Mon, 08/05/2024 - 15:43

సాక్షి, అమరావతి: ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూటమి రాజ్యాంగం నడుస్తోంది. కారణం లేకుండానే ప్రభుత్వ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథలు చెప్పొద్దు అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

ఇక, తాజాగా సమీక్ష సందర‍్బంగా చంద్రబాబు.. ఐఏఎస్‌ అధికారి సునీతపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, సమీక్షలో భాగంగా చంద్రబాబు పలువురు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈనెల ఏడో తేదీన చేనేత దినోత్సవం చీరాలలో నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ కార్యదర్శి ఐఏఎస్‌ సునీత కల్పించుకుని విజయవాడలో నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయారు చంద్రబాబు.

అనంతరం చంద్రబాబు.. చీరాలలో పెట్టమంటే విజయవాడలో ఎందుకు నిర్వహించమంటున్నావ్‌?. నీకు చీరాల రావడానికి ఏదైనా ఇబ్బంది ఉందా?. విజయవాడలో పెట్టమని ఎవరు చెప్పారు? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారి సునీత మాట్లాడుతూ.. అదే రోజున కేబినెట్‌ ఉందని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు.. అయితే చేనేత దినోత్సవాన్ని చీరాలలోనే మధ్యాహ్నం కొనసాగించండి. అంతేకానీ, అంతా మీ ఇష్టం కాదు అంటూ మండిపడ్డారు.

మరోవైపు.. ఇరిగేషన్‌ శాఖలో పనులు వేగంగా జరుగుతున్నాయని, మంత్రి రామానాయుడు ఎక్కువసేపు అందుబాటులో ఉంటున్నారని ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. మంత్రి సెక్రటరీలా.. సెక్రటరీ మంత్రిలా పనిచేస్తున్నారని అన్నారు. దీంతో, చంద్రబాబు.. కథలు చెప్పొదు అంటూ సాయి ప్రసాద్‌కు చురకలంటించారు. ఎవరూ ఎక్కువ మాట్లాడాల్సిన పనిలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు సీఎంగా బాధ్యతల స్వీకరణ తర్వాత ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా బొకేను అందించారు. ఆమె బొకే ఇస్తే చంద్రబాబు తీసుకోవడానికి తిరస్కరించారు. ఈ సమయంలో చంద్రబాబు తీరును కొందరు మాజీ ఐఏఎస్‌లు ఖండించారు. సీఎం స్థానంలో ఉండి అధికారుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ప్రశ్నించారు. వారిని అవమానించడం కరెక్ట​్‌ కాదంటూ హితవు పలికారు.

ఇక, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి పీయూష్ కుమార్‌ను రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)