Breaking News

కీర్తి చోర నారా.. మరో చోరీ!

Published on Sun, 01/18/2026 - 04:50

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ  క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. ఇప్పటికే విశాఖలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు విషయంలో క్రెడిట్‌ చోరీకి పాల్పడిన చంద్రబాబు.. తాజాగా కాకినాడ గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టును కూడా తన ఘనతగా చెప్పుకొంటూ భారీ ప్రకటనలను జారీ చేయించారు. కాకినాడలో భారీ గ్రీన్‌ అమ్మోనియా యూనిట్‌ నెలకొల్పే విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రీన్‌కో 2023లోనే ఒప్పందం కుదుర్చుకుని దానికి అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తే.. చంద్రబాబు సర్కారు ఆ ఘనతను తన ఖాతాలో వేసుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

2023లో బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో అప్పటి కేంద్రమంత్రి హరదీప్‌సింగ్‌ పూరి సమక్షంలో కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టును నెలకొల్పడానికి గ్రీన్‌కో సంస్థ యూనిపెర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 2023 మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌(జీఐఎస్‌)లో కాకినాడలోగ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఏఎం గ్రీన్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కాకినాడ గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాంలో చర్చ జరగడంతో పాటు అవార్డులు దక్కించుకుంది. పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్‌ మార్కెట్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్‌–బయోలాజికల్‌ ఆరిజిన్‌ (ఆర్‌ఎఫ్‌ఎన్‌బీఓ) ప్రీ–సరి్టఫికేషన్‌ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్‌ నిలిచింది.  

కేంద్రం కంటే ముందుగానే సొంత పాలసీ 
రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2023లోనే ఓ ప్రత్యేక పాలసీని రూపొందించింది. గ్రీన్‌ ఎనర్జీపై  కేంద్రం పాలసీ తీసుకురావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం గ్రీన్‌ హైడ్రోజన్‌ డిమాండ్‌ ఏడాదికి దాదాపు 0.34 మిలియన్‌ టన్నులు (ఎంటీ) ఉంటే రానున్న ఐదేళ్లలో సంవత్సరానికి 0.5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్, 2 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పాలసీని రూపొందించింది. ఒక మిలియన్‌ టన్ను గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయగలిగితే 12 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేసింది.

ఈ పాలసీ అమలుకు న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎన్‌ఆర్డీసీ ఏపీ) నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ పాలసీతో ఎనీ్టపీసీ, ఏఎం గ్రీన్‌కో, రెన్యూ ఎనర్జీ, ఇండోసోల్, ఏబీసీ, అదానీ గ్రీన్‌ఎనర్జీ వంటి అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వచ్చాయి. 2023లో జరిగిన జీఐఎస్‌ సదస్సులో మొత్తం రూ.13.11 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు వస్తే, అందులో ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే రూ.9,07,127 కోట్ల విలువైన 40కి పైగా ఒప్పందాలు కుదిరాయంటే ఈ రంగంలో పెట్టుబడులకు వైఎస్‌ జగన్‌ ఏ స్థాయిలో కృషి చేశారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు సర్కారు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటోంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)