Breaking News

ప్రైవేటీకరణ చెయ్యనని నేను చెప్పాలా?.. ఏం తమాషాగా ఉందా?

Published on Sat, 11/15/2025 - 19:46

సాక్షి, విశాఖపట్నం: సీఐఐ సదస్సు వేళ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను వైట్‌ ఎలిఫెంట్‌(ప్రతిష్టాత్మకంగా కనిపించినా.. ఆర్థికంగా నష్టాన్ని కలిగించే ప్రాజెక్ట్‌)తో పోల్చిన ఆయన.. ప్రతీసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదని తేల్చేశారు. 

శనివారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘మూడు నెలలకొకసారి రివ్యూ నేనూ చేస్తున్నా. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని ఉంది. కార్మికులు ఇంట్లో పడుకొని పని చెయ్యకపోతే జీతాలు ఎవరు ఇస్తారు?. ప్రతీసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదు. అన్ని స్టీల్ ప్లాంట్‌లకు లాబాలు వస్తుంటే వైజాగ్ స్టీల్‌కు ఎందుకు  రావడం లేదు?. పబ్లిక్ సెక్టార్‌లో ఉందని బెదిరిస్తామంటే కుదరదు. ప్రతీసారి జీతాలు ఇవ్వాలంటే ఎలా?. ప్రైవేటీకరణ చెయ్యనని నేను చెప్పాలా? ప్యాకేజీ ఇచ్చాం కదా?.. ఏం తమాషాగా ఉందా??’’ అని అన్నారు.

మరోవైపు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కుట్ర కొనసాగుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులపై యాజమాన్యం కొత్త నిబంధనలు తెచ్చింది. ప్రొడక్షన్‌ శాతాన్ని బట్టి జీతమంటూ సర్క్యూలర్‌ జారీ చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉత్పత్తితో జీతానికి సంబంధం ఏంటి? అని నిలదీస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీ చేస్తే నిబంధనలు ప్రకారం జీతం ఇవ్వాలని.. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆంక్షలు తేవొద్దని.. వెంటనే సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)