Breaking News

చంపేస్తా.. దిక్కున్న చోట చెప్పుకోండి..!

Published on Fri, 04/11/2025 - 05:37

రైల్వేకోడూరు అర్బన్‌/ఓబులవారిపల్లె: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తాలూకా అంటూ ఒక జనసేన నాయకుడు ఎన్‌ఆర్‌ఐ దంపతులపై దాడి చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, చెన్నరాజుపోటులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, బుధవారం రాత్రి  గ్రామంలో శ్రీ సీతారాముల గ్రామోత్సవాన్ని నిర్వహించారు.ఒంటిగంట సమయంలో దేవుడి ఊరేగింపు ఎన్నారై పత్తి సుబ్బరాయుడు ఇంటి వద్దకు చేరుకుంది.

ఆరోజే కువైట్‌ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన, భార్య రాజేశ్వరితో కలిసి బయటకు వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటుండగా,  మాజీ సర్పంచ్, జనసేన పార్టీ రాయలసీమ జోనల్‌ కన్వీనర్‌ జోగినేని చిన్నమణి ఇనుపరాడ్‌తో ఇరువురిపై దాడిచేసి, చంపేస్తానంటూ బెదిరించాడు.

డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్, జిల్లా ఎస్పీ అందరూ తెలిసిన వారేనని పేర్కొంటూ, మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ వెళ్లిపోయాడు. బాధిత దంపతులు రైల్వేకోడూరు సీఐ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ, గతంలో గ్రామంలో పొలాల వద్ద చిన్నమణికి తమకు విభేదాలు ఉన్నాయని, అవి మనసులో పెట్టుకొని  తమపై కక్షపెట్టుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని అన్నారు. దీనిపై సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)