Breaking News

పిఠాపురంలో ‘గ్లాస్‌’ మేట్స్‌ గలాటా

Published on Tue, 04/15/2025 - 04:18

పిఠాపురం: జనసేన అధి­నేత పవన్‌ కళ్యాణ్‌ ఇలాకా పిఠాపురంలో నిన్నటి వరకూ టీడీపీ, జనసేన నాయకులే కొట్టుకుంటూ రాగా...­తా­జాగా  జనసేనలోనే రెండు వర్గా­లు బాహాబాహీ­కి దిగాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. పిఠాపు­రంలో సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ తరపున పలు కార్యక్రమాల్లో పిఠాపురం జనసే­న ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆయన వెంట హాజరైన జనసేన నేతల్లో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి వివాదానికి తెర లేపారు.

పిఠాపురం పట్టణం ఇందిరా నగర్‌ రజాల­పేట­లో ఇరువర్గాలూ వాగ్వాదానికి దిగాయి. ‘పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉన్న మేమే అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటామని, మీరు వెనకాల రావాలని’ ఓ వర్గాన్ని మరో వర్గం అడ్డ­గించింది.‘మమ్మల్ని అడ్డుకోడానికి మీరెవరు? మీరు ఎప్పుడు వస్తే మాకేంటి? మేము పార్టీకి పని చేశాం. మేమూ నేతలమే.

మేం వస్తాం, ఎవరడ్డుకుంటారో చూ­స్తాం’ అంటూ మరో వర్గం తిరగబడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గా­లనూ సముదాయించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు చాలాసేపు ఫలించలేదు. ఈ గొడవను కవర్‌ చేసేందుకు ప్రయ­త్నించిన మీడి­యా ప్రతినిధులపై  జన­సేన నేతలు దురు­సుగా ప్రవర్తించారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)