Breaking News

టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు 

Published on Wed, 04/12/2023 - 05:02

సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులిచ్చారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వెలువడుతున్న ‘చైతన్య రథం’ పత్రిక ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్థి క మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ నోటీసులిచ్చారు.

‘చైతన్య రథం’ పత్రికలో గత ఏడాది నవంబరు 23వ తేదీ ఎడిషన్‌లో ‘అపరిచితుడు’, ‘బుగ్గనగారి బాగోతం’ శీర్షికలతో అవాస్తవ కథనాలు ప్రచురించి తనపై దుష్ప్రచారం చేశారని మంత్రి బుగ్గన... సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తాను సమర్పిం చిన నామినేషన్‌ పత్రాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి అందులో పేర్కొన్న ఆస్తుల వివరాలను ఫోర్జరీ చేశారని బుగ్గన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విధంగా తన భూముల విస్తీర్ణం, వాటి విలువను అమాంతంగా పెంచేసి దుష్ప్రచారం చేశారన్నారు.

 సీఐడీ అధికారులు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, విచారించి ఈ నోటీసులిచ్చారు. సెక్షన్‌ 92 సీఆర్‌పీసీ కింద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట నోటీసులు ఇచ్చారు. 2022, నవంబరు 23 నాటి చైతన్య రథం పత్రిక కాపీ, ఆ పత్రిక ఎడిటర్, ఆ వార్తలు రాసిన విలేకరి వివరాలు తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)