Breaking News

సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్‌

Published on Tue, 10/10/2023 - 07:35

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి  చేరుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను సీఐడీ విచారించనుంది.  ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై  లోకేష్‌ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా నిన్న(సోమవారం) మంగళగిరికి చేరుకున్నారు లోకేష్‌. 

కోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం ఉదయం 10గంటలకు సీఐడీ ఎదుట నారా లోకేష్‌ హాజరు కావాల్సి ఉంది.  కాగా, చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి నారా లోకేష్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్‌కు ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులిచ్చారు సీఐడీ అధికారులు. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ కేసులో ఏ-14గా ఉన్నారు లోకేష్‌  

రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లోకేష్‌ను విచారించవచ్చన్న హైకోర్టు.. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. విచారణ సమయంలో లోకేశ్‌ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్‌ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు స్పష్టం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)