Breaking News

భార్య అక్రమ సంబంధం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Published on Sun, 11/30/2025 - 12:16

చిత్తూరు : సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఈ మధ్య ప్రియుడి కోసం భర్తలను చంపుతున్న భార్యలు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటనే పలమనేరు మండలంలో ఐదు నెలల క్రితం జరగ్గా ఎట్టకేలకు శనివారం ఈ కేసులో నిందితులను పలమనేరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ స్వర్ణతేజ తెలిపారు. ఆ వివరాలు ఇలా.. 

 మండలంలోని కోతిగుట్టకు చెందిన వెంకటేష్‌ , శిల్ప భార్యాభర్తలు. భర్త సీ. వెంకటేష్‌ సైన్యంలో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో శిల్ప పక్క గ్రామమైన నూనేవారిపల్లికి చెందిన కనకరాజు కుమారుడు ఎం.వెంకటేష్‌తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త మిలటరీలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేష్‌ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న మిలటరీలోని  సీ.వెంకటేష్‌ ఉన్నట్టుండి గ్రామానికి వచ్చి భార్యను నిలదీసి గొడవపెట్టుకుని పెద్ద మనుషులకు చెప్పి ఇకనైనా సక్రమంగా ఉండాలని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే తన భర్త ఉండగా వ్యవహారం కష్టమని భావించిన శిల్ప, ఆమె ప్రియు డు ఇద్దరూ కలిసి  సీ.వెంకటేష్‌  ఇంటికి రాగానే చంపేయాలని ప్లాన్‌ చేసుకున్నారు.

 ఆ మేరకు గత మేనెల 16న ఇంటికొచ్చిన భర్త సీ. వెంకటేష్‌ నిద్రిస్తుండగా భార్య కాచిన వేడి నూనెను భర్తపై పోసి అతను విలవిలలాడుతుండగా ప్రియుడితో  కలిసి పారిపోయింది. దీనిపై అప్పట్లో పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీరిని పట్ట ణ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇన్ని రోజులుగా భర్త సీ.వెంకటేష్‌ కాలిన గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిచార్జి అయి డ్యూటీకి వెళ్లిపోయాడు.  

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)