Breaking News

చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా

Published on Sat, 08/28/2021 - 11:06

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పదేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే దిగజారుడు స్వభావం బట్టబయలవుతోంది. సదరు చిరుద్యోగి తన పబ్బం గడుపుకునేందుకు అధికారులను డబ్బుతో ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

విలాసాలను రుచి చూపించి వశం చేసుకోవడం.. చిన్న అవసరాలను తీర్చి ఆకట్టుకోవడం.. వ్యక్తిగత విషయాలను సైతం తనతో పంచుకునేలా నమ్మకం సంపాదించుకోవడం.. వలలో చిక్కని వారిని ముగ్గులోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత వారిపై అవినీతిపరులనే ముద్ర వేసి మానసిక వేదనకు గురిచేస్తాడు. దొంగ వీడియోలను చిత్రీకరించి బ్లాక్‌ మెయిల్‌కు దిగుతాడు. చివరికి నయానో.. భయానో తన దారికి తెచ్చుకుని అక్రమార్జనకు మార్గంసుగమం చేసుకుంటాడు. ఇదీ ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన చిరుద్యోగి ‘చీకటి బాగోతం’ .

సాక్షి, తిరుపతి: అక్రమాలనే ఆదాయ వనరుగా మార్చుకున్న తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ చిరుద్యోగి లీలలు అన్నీఇన్నీ కావు. పదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన ఆయన ప్రమేయం లేనిదే ఒక్క రిజిస్ట్రేషన్‌ జరగని పరిస్థితి ఏర్పడింది. చిల్లర కోసం సదరు చిరుద్యోగి వేస్తున్న చీకటి వేషాలపై కార్యాలయం సిబ్బందే కథలు కథలుగా చెబుతున్నారు. ఉన్నతాధికారులపైనే పెత్తనం చెలాయిస్తున్న ఆయన వైఖరిపై విస్తుపోతున్నారు.

పథకం ప్రకారం ప్రలోభం
తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి చిరుద్యోగే సర్వం సరç్ఛౌరా చేస్తుంటాడు. అందరితోనూ చనువుగా మసలుకుంటుంటాడు. అందరి అవసరాలను తానే తీరుస్తుంటాడు. తద్వారా తన అవినీతికి ఎవరూ అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. బదిలీపై వస్తున్న అధికారులను సైతం ముందుగానే ఫోన్‌ లో సంప్రదించి తిరుపతిలో అన్నీ తానే అని నమ్మిస్తాడు. వారికి కావాల్సిన పనులన్నీ చేసిపెట్టి తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఒకవేళ వచ్చిన అధికారి వలలో చిక్కకుంటే మరింత దారుణంగా వ్యవహారం నడిపిస్తాడు.

ఏదో ఒక ఫంక్షన్‌ పేరు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి ఆహారం, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపేస్తాడు. మత్తులోకి జారుకున్న అధికారిపైకి వేశ్యలను ఉసిగొల్పి నగ్న వీడియోలను చిత్రీకరిస్తాడు. కొద్దిరోజుల తర్వాత ఆ అధికారికి వీడియోలు చూపించి బ్లాక్‌మెయిలు చేస్తాడు. ఇక చేసేది లేక నిజాయితీపరులైన అధికారులు సైతం చిరుద్యోగికి అనుకూలంగా మారిపో తారు. అప్పటి నుంచి ఆ అధికారి ఉన్నన్ని రోజులు యథేచ్ఛగా అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతాడు. డబ్బుకు లొంగే అధికారులైతే చిరుద్యోగి మరింత దారాళంగా వ్యవహరిస్తాడు. నెలకు ఎంత కావాలి అని డీల్‌ కుదుర్చుకుంటాడు. ( చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు )

ఒకేసారి ఏడాదికి ఇవ్వాల్సిన సొమ్మును ముట్టజెప్పి మొత్తం కార్యాలయాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగని అధికారులపై లేనిపోని నిందలు మోపి విస్తృతంగా ప్రచారం చేయిస్తాడు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారితో యథాలాపంగా మాట్లాడుతున్న అధికారుల వీడియోలను ఫోను లో చిత్రీకరించి అవినీతి మరకను అంటిస్తాడు. చిరు ద్యోగి బారిన పడి పలువురు అధికారులు మానసి క క్షోభకు గురై తిరుపతి నుంచి బదిలీ చేయిం చుకుని వెళ్లిపోయినట్లు సమాచారం.

ఎవరితో కలవ  కుండా తమ పని తాము చేసుకుని వెళ్లే అధికారులను సైతం చిరుద్యోగి వదిలిపెట్టడం లేదని పలు వురు సిబ్బంది తెలియజేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఓ అధికారి ఒంటరిగా కూర్చుని మద్యం తాగుతున్న వీడియోను రికార్డ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని మరికొందరు అధికారులను బెదిరింనట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రచారం సాగుతోంది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)