Breaking News

వైఎస్‌ జగన్‌ను కలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

Published on Fri, 01/30/2026 - 10:56

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ మద్యం కేసులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. 

శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెళ్లారు. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు, తన కుటుంబ సభ్యులను కేసులతో వేధించిన తీరును జగన్‌కు వివరించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్‌ జగన్‌ చెవిరెడ్డికి భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాడే క్రమంలో ఇలాంటి వేధింపులు తప్పవని.. వాటిని ధీటుగా ఎదుర్కొంటూ  ప్రజలకు అండగా నిలుద్దామని.. ఈ విషయంలో పార్టీ నాయకులు, క్యాడర్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెవిరెడ్డితో జగన్‌ అన్నారు. చెవిరెడ్డి వెంట ఆయన కుమారులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిలు ఉన్నారు.

అక్రమ మద్యం కేసులో.. ప్రధాన నిందితుడు రాజ్‌ కేసిరెడ్డి ద్వారా ముడుపులు అందుకుని, వాటిని అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కోసం ఖర్చు చేశారంటూ చంద్రబాబు నాయుడు వేసిన సిట్‌ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జూన్‌ 17న బెంగళూరులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసింది. అయితే విచారణలో ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో సుమారు 226 రోజులపాటు విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా గడిపిన చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ గురువారం(జనవరి 29న) ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)