పోలీస్‌ స్టేషన్‌లోనే మహిళపై చెప్పుతో దాడి

Published on Sun, 08/25/2024 - 09:54

సాక్షి, టాస్‌్కఫోర్స్‌: చంద్రగిరి ఎమ్మెల్యే నాని అనుచరులు ఇష్టమొచి్చనట్లు లేచిపోతున్నారు. పోలీసులన్నా, చట్టాలన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. తనపై ఫిర్యాదు చేయడానికి వచి్చన రజక సామాజిక వర్గానికి చెందిన దంపతులు, వారికి మద్దతుగా వచి్చన సమీప బంధువువైన మహిళపై పోలీస్‌ స్టేషన్‌లోనే సీఐ ఎదురుగా నాని అనుచరుడు చెప్పుతో దాడికి దిగాడు. బాధితుల కథనం మేరకు వివరాలు.. 

చంద్రగిరి మండలంలోని అగరాలకు చెందిన భవిత, సురేష్‌ దంపతులు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు జయచంద్రారెడ్డి మధ్య గత కొంత కాలంగా ఆరి్థక లావాదేవీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగర్‌ కాలనీలోని వారి ఇంటిని రిజిస్ట్రేషన్  చేసివ్వాలంటూ జయచంద్రారెడ్డి హెచ్చరించాడు. ఈ క్రమంలో శనివారం చంద్రగిరికి సమీ­పంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిచి బెదిరించి,  విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. 

బాధితులు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించగా.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితులు తిరు­పతి ఎస్పీని ఆశ్రయించి జయచంద్రారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ బాధితులను మళ్లీ స్టేషన్‌కు పిలిచి విచారణ ప్రారంభించారు. బాధితులకు సహాయంగా వారి సమీప బంధువు చంద్రమ్మ తదితరులు కూడా స్టేషన్‌కు చేరుకున్నారు.  

సీఐ సమక్షంలోనే చెప్పుతో దాడి 
సీఐ ఇచి్చన సమాచారాన్ని అందుకుని స్టేషన్‌కు వచి్చన జయచంద్రారెడ్డి సీఐ ముందే బాధితులను మరోసారి బెదిరిస్తూ.. ‘‘లం..! నాకే ఎదురు చెబుతావా’’ అంటూ అసభ్య పదజాలంతో రెచి్చపోయాడు. ఈ క్రమంలోనే బాధితులకు సాయంగా వచి్చన మహిళను చెప్పుతో కొట్టాడు. దీంతో బాధితులు కన్నీరు పెట్టుకుంటూ సీఐ గది నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటన క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని సద్దుమణిగేలా చేసేందుకు ఎమ్మెల్యే నాని అనుచరులు రంగంలోకి దిగారు. వారు స్టేషన్‌లో సీసీ ఫుటేజీ మాయం చేసేందుకు ప్రయత్నించారని బాధితులు వాపోయారు.   

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)