Breaking News

‘నాలుగు రోజులైంది.. నా భార్యను నాకు అప్పగించండి సార్‌’

Published on Mon, 06/16/2025 - 09:36

సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరిలో వింత ఘటన వెలుగు చూసింది. తమ కులాలు వేరు అయినప్పటికీ ప్రేమ జంట.. పెద్దలను కాదని పెళ్లి చేసుకుంది. తమ ప్రేమను గెలిపించుకుంది. ఇలా ఆనందంలో ఉన్న తమను టీడీపీ నేతలు విడదీశారని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్యను తనతో పంపించాలని వేడుకుంటున్నాడు.

వివరాల ప్రకారం.. చంద్రగిరికి చెందిన భవ్య, రాయలపురానికి చెందిన దయాసాగర్ ప్రేమించుకున్నారు. దయాసాగర్‌ దళితుడు కావడం, కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఎలాగైనా తమ ప్రేమను గెలిపించుకోవాలన్నారు. ఈ క్రమంలో వీరద్దరూ జూన్ 11వ తేదీన కైలాసకోనలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం, తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ బంధువులు, కుటుంబసభ్యులకు సైతం పెళ్లి విషయాన్ని తెలిపారు. దీంతో, వారిద్దరినీ విడదీసేందుకు టీడీపీ నేతలు, భవ్య తండ్రి ప్లాన్‌ చేశారు. భవ్య తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి యువతిని ఆమె తండ్రి తీసుకెళ్లాడు. రెండు గంటల్లో పంపిస్తామని చెప్పి.. నాలుగు రోజులైనా తిరిగి పంపించకపోవడంతో దయాసాగర్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఈ సందర్బంగా దయాసాగర్‌ మాట్లాడుతూ.. టీడీపీ నేతల సహకారంతో నా భార్య భవ్యను తీసుకెళ్లారు. భవ్య తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెబితే నేను పంపించాను. రెండు గంటల్లో పంపిస్తామని తీసుకెళ్లారు.. నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా తీసుకురాలేదు. నాది తక్కువ కులం కావడంలో ఎన్నో మాటలు అన్నారు. మేమిద్దం మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాం. పోలీసులకు విషయం చెబితే ఆమె నుంచి వీడియో కాల్ చేపించమన్నారు. వీడియో కాల్ గమనిస్తే ఆమె చుట్టూ బంధువులు ఉండి నా భార్యను బెదిరిస్తున్నారు. మీ అమ్మకు ఎలా ఉంది అని అడిగితే, కొంచెం పర్లేదని, తగ్గితే వస్తా అని చెప్పింది. ఎక్కడున్నావని అడిగితే, చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఉన్నట్టు చెబుతోంది. నువ్వు ఎలా ఉన్నావు, జాగ్రత్తనేనా అని అడిగితే బానే ఉన్నానని చెప్పాను. 

ఆరు సంవత్సరాలుగా తనను చూస్తున్నాను.. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలుస్తోంది. అత్త ఎలా ఉన్నారని అడిగితే చూపించడం లేదు. అదే సమయంలో అమ్మాయిని భయపెడుతున్నారు. ఫోన్ చేస్తే ఓసారి మాట్లాడుతుంది, ఓసారి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆమెను తిరిగి పంపిస్తారని నాకు నమ్మకం లేదు. ఆసుపత్రిలో ఏం జరుగుతోందో ఒక్కసారిగా చూపించాలని కోరినే చూపించడం లేదు. వాళ్ల మీద నమ్మకం లేదని పోలీసులకు చెప్పాను. పోలీసులు మాత్రం ఆమె కొన్ని రోజులకు తిరిగి వస్తుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు పెంచారు కనుక ఆమెను కొడితే.. కొడతారని పోలీసులు అంటున్నారు. నా మాట పట్టించుకోవడం లేదు. జూన్ 11 నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోయా, కానీ సమస్య పరిష్కరించలేదు. ఎస్పీ సార్ మీరైనా నాకు న్యాయం చేయండి’ అంటూ ఆవేదన చెందాడు. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)