Breaking News

గన్‌తో కాల్చేస్తా.. నా కొడకా!

Published on Wed, 10/16/2024 - 04:32

సాక్షి, టాస్‌్కఫోర్స్‌: పట్టా భూమి విషయంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన చంద్రగిరి సీఐ జనసేన నేతను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా ‘నా కొడకా.. గన్‌తో కాల్చేస్తా..’ అంటూ బూతులు లంకించుకున్నారు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని జనసేన నేత పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. 

వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకాలవారిపల్లికి చెందిన పాశం గురుమూర్తి జనసేన నేత. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని విజయానికి తీవ్రంగా కృషి చేశాడు. కాగా.. గురుమూర్తి తండ్రి గురవయ్యకు అదే మండలం పనపాకంలో సర్వే నంబర్‌ 395/2డిలో రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. 

తండ్రి చనిపోవడంతో భూమిని తనపేరిట మార్చాలని గురుమూర్తి రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చాడు. ఆ భూమిని కాజేసేందుకు టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఆ భూమి ఆన్‌­లైన్‌ కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత సుబ్రహ్యణ్యంనాయుడు గురు­మూర్తిపై చంద్రగిరి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించడంతో పంచాయితీ కాస్తా పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. 

ఆత్మహత్యకు ప్రయత్నం 
గౌరవంగా బతుకుతున్న తనను సీఐ అసభ్యంగా దూషించడమే కాకుండా చంపుతామని బెదిరించడాన్ని గురుమూర్తి తట్టుకోలేకపోయాడు. ఇంటికెళ్లిన గురుమూర్తి మనస్తాపంతో అదే రోజు రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డిపై చర్యలు తీసు­కోవాలని, సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం తిరు­పతి జిల్లా ఎస్పీని కలిసి గురుమూర్తి ఫిర్యాదు చేశాడు.  

‘కాల్చి పారేస్తే అడిగే దిక్కుండదు’ 
పట్టా భూమి వ్యవహారంలో టీడీపీ నేతకు బాసటగా నిలిచిన సీఐ సుబ్బరామిరెడ్డి ఆదివారం నాడు గురుమూర్తిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి బెదిరించారు. ‘నా కొ..ను.. పగలకొట్టి లోపలేయండి. నీయమ్మా లం.. కొడకా. ఏమనుకుంటు­న్నా­వురా. దొంగ నా కొ.. బూటు కాలితో తంతా నా కొ.. మళ్లీ మాట్లాడితే గన్‌తో కాల్చిపారేస్తా’ అంటూ సీఐ సుబ్బరామిరెడ్డి తనను దూషించి కొట్టినట్టు బాధితుడు గురుమూర్తి వాపోయాడు. 

కాల్చేస్తా.. అంటూ టేబు­ల్‌పై తుపాకీ పెట్టి బెదిరించినట్టు కన్నీరుమున్నీరయ్యాడు. ‘నా మాట కూడా వినండి సార్‌. నేనూ చదువుకున్న వాడినే. అలా తిట్టకండి సార్‌’ అని వేడుకున్నా కనికరించలేదని గురుమూర్తి వాపో­యాడు. కాగా.. సీఐ సుబ్బరామిరెడ్డిపై తొలి నుంచి అనేక ఆరోపణలున్నాయి. గ్రావెల్, ఇసుక దందా­లకు సీఐ వత్తాసు పలుకుతున్నారని స్థానికులు బహిరంగంగానే చెబుతూ అనేక ఉదంతాలను గుర్తు చేస్తున్నారు.   

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)