మీరు ప్రూవ్‌ చేసుకోకపోతే ఆల్టర్నేటివ్‌ ఆలోచించాల్సి ఉంటుంది..!

Published on Mon, 11/04/2024 - 12:31

సాక్షి,రామచంద్రాపురం : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మంత్రి సుభాష్‌కు చంద్రబాబు అక్షింతలు వేసిన ఆడియోను ఆయన వ్యతిరేక వర్గం లీక్‌ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు విషయంలో వెనుకబడిన మంత్రి సుభాష్‌ను తీవ్రంగా హె చ్చరించారు చంద్రబాబు

తొలిసారి ఎమ్మెల్యే, మంత్రైన సుభాష్‌.. పనితీరు మార్చుకోవాలంటూ చివాట్లు పెట్టారు. ‘పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు మీకెందుకయ్యా? ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం చేస్తారయ్యా? ఎవ్రిడే మీకు టెస్టే.. మిమ్మల్ని మీరు ప్రూవ్‌ చేసుకోవాలి. ఏ ఎన్నికలు వచ్చినా  మిమ్మల్ని మీరూ ప్రూవ్‌ చేసుకోవాలి.

లేదంటే మేం ఆల్టర్నేట్‌ చూస్తాం’ అని  ఫోన్‌లో చంద్రబాబు వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్ధంగాక మంత్రి సుభాష్‌ నీళ్లు నమిలారు. ఆ ఆడియో అటు సోషల్‌ మీడియాలోనూ, ఇటు టీడీపీ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతోంది.
 

	మంత్రి సుభాష్ కు చంద్రబాబు వార్నింగ్

 పనితీరు మార్చుకోండి లేదంటే..
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదుపై చంద్రబాబు నేతలకు టార్గెట్‌ ఇచ్చారు.  ఈ సభ్యత్వ నమోదుపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రుల్ని, ఇతర పార్టీ నేతల్ని వివరాల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే, మంత్రి సుభాష్‌కు తన నియోజకవర్గంలో 9వేల వరకు సభ్యత్వ నమోదు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సభ్యత్వ నమోదు విషయంలో మంత్రి సుభాష్‌ పనితీరు సరిగ్గా లేదని కేవలం 29 శాతం మాత్రమే చేశారని చిందులు  తొక్కారు చంద్రబాబు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)