Breaking News

దేవుడా..! నీ భూములకు నువ్వే దిక్కు!

Published on Fri, 05/30/2025 - 02:25

సాక్షి, అమరావతి: దేవుడి మాన్యాలను తమకు నచ్చిన­వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టి హారతి కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది! రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల విలువైన భూములపై కన్నేసి ఇకపై ఎలాంటి వేలం లేకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపింది. వీటిని సేవా సంస్థల ముసుగులో ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వాటికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈమేరకు మే 2వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్‌ 139 విడుదల చేసింది. క్యాబినెట్‌ ఆమోదం లేకుండా అడ్డదారిలో పని పూర్తి కానిస్తుండటం గమనార్హం. అదే దేవాలయాల భూములకు పారదర్శకంగా వేలం నిర్వహిస్తే పలువురు పోటీపడి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అలాంటప్పుడు వేలం లేకుండా విలువైన భూములను ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? రూ.వేల కోట్ల ఆస్తులను అప్పగిస్తూ చట్ట సవరణ చేయడం ఎవరి ప్రయోజనం కోసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

భారీ కుంభకోణం జరుగుతున్నట్లు అక్కడే అర్థమవుతోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో దేవదాయ శాఖ పరి«ధిలోని 4.67 లక్షల ఎకరాల దేవుడి భూముల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే పలు సంస్థలు ఎలాంటి వేలం లేకుండా లీజు పేరుతో దేవుడి భూములను దక్కించుకునేందుకు ప్రతిపాదనలతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 


వివిధ దేవాలయాలకు చెందిన అత్యంత ఖరీదైన ఆస్తులకు ఎసరు పెడుతూ, భూములను కైంకర్యం చేస్తూ టీడీపీ సర్కారు నిర్ణయాలు తీసుకోవడంపై ధార్మిక సంఘాలు, హైందవ ధర్మ పరిరక్షణ సంస్థలు మండిపడుతున్నాయి. వేలం లేకుండా ఇచ్చేందుకు 2003 నాటి చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదించడం దారుణమని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఏడాదిగా పవిత్ర పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో వరుసగా అపచారాలు, అన్యూహ ఘటనలు చేసుకుంటుండగా ఇప్పుడు ఏకంగా ఆలయాల ఉనికికే ముప్పు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)