Breaking News

కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించిన చంద్రబాబు!

Published on Wed, 11/01/2023 - 08:45

సాక్షి, గుంటూరు: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్‌ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తొలిరోజే కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వస్తూనే మీడియాతో మాట్లాడారాయన. అంతేకాదు.. జనం మధ్య తిరగకూడదని, ఆస్పత్రికి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కోర్టు విధించిన షరతులనూ ఆయన ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది.

చంద్రబాబుకి ఉన్న అరోగ్య కారణాల రీత్యా మానవతాధృక్పథంతో నాలుగు వారాలపాటు పలు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ర్యాలీలో పాల్గొనకూడదని.. మీడియాతో మాట్లాడకూడదు.. కేసు దర్యాప్తును ఏకంగానూ ప్రభావితం చేయకూడదని తీర్పు ఉత్తర్వుల్లో జస్టిస్‌ మల్లికార్జునరావు స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ హైకోర్టు షరతుల్ని చంద్రబాబు లెక్కచేయలేదు. బయటకు రాగానే వెంటనే మీడియాతో మాట్లాడారు.

ఈ నేపథ్యంలో.. మధ్యంతర బెయిల్‌ షరతుల ఉల్లంఘనను సీఐడీ న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. కేవలం కంటి సర్జరీ కోసమే ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. నవంబర్‌ 28వ తేదీన సాయంత్రం తిరిగి రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే మధ్యంతర బెయిల్‌ వెంటనే రద్దు అవుతుందని కోర్టు చంద్రబాబును హెచ్చరించింది కూడా.  

కోర్టును బాబు తప్పుదోవ పట్టించారు
కోర్టు తీర్పును ఉల్లంఘించిన చంద్ర బాబు బెయిల్ రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి మంగ రాజు కోరుతున్నారు. ఆరోగ్య కారణాలు చూపి, బెయిల్ మీద వచ్చిన చంద్రబాబు.. మీడియా సమావేశంలో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారాయన. ‘‘చంద్రబాబు తనకు రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుపట్టించారు. ఆరోగ్యం బాగోలేదని నాటకాలు ఆడారు. కాబట్టి, వెంటనే ఆయన బెయిల్‌ రద్దు చేయాలి. జైలుకు పంపించాలి’’ అని చీకటిమిల్లి మంగరాజు ఒక ప్రకటనలో కోరారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)