Breaking News

సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశాను: చంద్రబాబు

Published on Fri, 06/13/2025 - 03:20

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా సూపర్‌ సిక్స్‌ గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని అన్నారు. తల్లికి వందనం పథకం అమలుపై గురువారం ఆయన ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట మేరకు.. నలుగురు పిల్లలున్న వారికి కూడా ఇస్తున్నామని తెలిపారు. 

67 లక్షల మంది పిల్లలకు రూ.13 వేలు చొప్పున వారి తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. మిగతా రెండు వేల రూపాయలు స్కూళ్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి అమ్మ ఒడి మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని చెప్పారు. పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశామన్నారు. ఈ నెల 20న కేంద్రం రైతులకు డబ్బులు వేస్తుందని, అదే రోజు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రం తొలి వాయిదా ఇస్తుందన్నారు. 

ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని, దీంతో సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసినట్లేనని తేల్చి చెప్పారు. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై దళితులను బహిరంగంగా లాఠీలతో కొట్టిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్‌ జగన్‌ ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘దేవతల రాజధాని అమరావతిని వేశ్యల నగరం అంటారా... ఎంత కొవ్వు ఎక్కింది.. మీడియా ఏం చేస్తోంది.. ఆ అంశాన్ని డైవర్ట్‌ చేయడానికే జగన్‌ 15 వేల మందితో పొగాకు రైతుల దగ్గరకు వెళ్లి రౌడీయిజం చేశారు. 

పొగాకు క్వింటా రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నాం. రాజకీయ ముసుగులో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. తీవ్రవాదులపైనే పోరాటం చేసిన వాడిని. ప్రజల భద్రత విషయంలో రాజీపడను. ఏం చేయాలో చేసి చూపిస్తా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు నడుస్తోందని మంత్రి లోకేశ్‌ అన్నారు. 60 శాతం కుటుంబాలకు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)