Breaking News

కృష్ణుడికి శఠగోపం 

Published on Thu, 02/09/2023 - 04:54

సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పదవి యనమల రామకృష్ణుడి కుటుంబంలో చిచ్చు రేపింది. యనమల రామకృష్ణుడు తన సోదరుడు యనమల కృష్ణుడిని కాదని తన కుమార్తె దివ్యకు ఇన్‌చార్జి పదవి ఇప్పించుకున్నారు. రెండుసార్లు అక్కడ పోటీ చేసి..ఇన్నాళ్లూ తునిలో పార్టీని నడిపిన తనకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో కృష్ణుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.

చంద్రబాబు, తన అన్న యనమల రామకృష్ణుడు తనను మోసం చేశారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. కార్యకర్తల సమావేశం నిర్వహించి ఇటీవల తన ఆవేదనను వ్యక్తం చేశారు. తన అన్న రామకృష్ణుడి రాజకీయ ఎదుగుదలకు 40 ఏళ్లుగా సహకరించానని, ఆయన ఉన్నత పదవుల్లో ఉన్నా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూశానని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అవకాశవాదంతో తనను పక్కనపెట్టి ఆయన కుమార్తెను ఇన్‌చార్జిగా నియమించడాన్ని ఆయ­న జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబు బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టారు.  

బాబుని కలవడానికి ఇష్టపడని కృష్ణుడు..! 
బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి య­నమల బ్రదర్స్‌ని చంద్రబాబు పిలిపించుకు­న్నా­రు. అయితే కృష్ణుడు రావడానికి ఇష్టపడకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పంపి ఆయన్ను ఇంటికి రప్పించారు. యనమల రామకృష్ణుడి సమక్షంలో కృష్ణుడిని చంద్రబాబు బుజ్జగించి భవిష్యత్తులో మంచి అవకాశం ఇస్తానని, పార్టీకి సహకరించాలని బతిమలాడారు.

అనంతరం యనమల కుటుంబంలో వివాదం సద్దుమణిగినట్లు మీడియాకు లీకు­లు ఇచ్చారు. కానీ కృష్ణుడు ఇంకా అసంతృప్తి­లో­నే ఉన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీ కార్యక్రమాలను నిర్వహించానని కృష్ణుడు గుర్తుచేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణుడు పోటీ చేశారు.

ఈ సారి కూడా తనకే పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తుందని ఆయన ఆశిస్తున్న తరుణంలో బాబు ఆయనకు ఝలక్‌ ఇచ్చారు. దీం­తో బాబు తీరును కృష్ణుడు బాహాటంగానే తప్పుబడుతున్నారు. ఇలా అయితే రానున్న ఎన్నికల్లో మరోసారి పార్టీ చావుదెబ్బ తింటుందని ఆయ­న తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)