Breaking News

ఈ–పంటకు నిర్లక్ష్యం చీడ!

Published on Sun, 01/18/2026 - 04:14

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా, విజయవంతంగా అమలైన ‘ఈ–క్రాప్‌’ నమోదును ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. దీని నమోదు విషయంలో సర్కారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఈ రబీ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ, ఈ–పంటలో నమోదైంది కేవలం 11.35 లక్షల ఎకరాలే.

ఈకేవైసీ అయితే ఒక్క రైతు నుంచి కూడా నమోదుకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. మరోవైపు.. ఈ సీజన్‌ నుంచి రైతులు సాగుచేసిన పంటలను రైతులే నమోదు  చేసుకోవాలంటూ చెప్పడం వల్ల ఈ–క్రాప్‌ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

లక్ష్యానికి దూరంగా ఈ–పంట నమోదు..
వాస్తవానికి.. ఏటా రబీ సీజన్‌లో నవంబరు మొదటి వారంలో ఈ–క్రాప్‌ నమోదు ప్రారంభించి జనవరి 31కల్లా పూర్తిచేసేవారు. కానీ, ఈ ఏడాది డిòసెంబరు 17న శ్రీకారం చుట్టారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రకారం నూరు శాతం ల్యాండ్‌ పార్శిల్స్‌ నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏడు శాతానికి మించి నమోదు చేయలేకపోయారు. 11.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 47వేల ఎకరాల్లో ఉద్యాన, 670 ఎకరాల్లో పట్టు, 5,962 ఎకరాల్లో సామాజిక అటవీ పంటలు నమోదు చేశారు. అలాగే, ఈ సీజన్‌లో దాదాపు 45 లక్షల మంది రైతులు రబీ పంటలు సాగుచేస్తుండగా, ఇప్పటివరకు కేవలం 5.57 లక్షల మంది సాగుచేసిన పంటల వివరాలను మాత్రమే నమోదుచేశారు. ఇక డిజిటల్‌ క్రాప్‌ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.93 కోట్ల ల్యాండ్‌ పార్సిల్స్‌ ఉండగా, ఇప్పటివరకు కేవలం 11 లక్షలు మాత్రమే నమోదుచేశారు. 

నిర్వీర్యమే లక్ష్యంగా స్వీయ నమోదు..
ప్రస్తుత సీజన్‌ నుంచి తాము సాగుచేసిన పంట వివరాలను భౌగోళిక సరిహద్దులతో సహా నేరుగా రైతులే ఈ–పంట యాప్‌లో స్వయంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి.. రైతులు పొలంలో ఉన్న సమయంలో ఆర్బీకే సిబ్బంది వెళ్లి రైతుతో పాటు పంట ఫొటోలను తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే, తాము వెళ్లినప్పుడు వారు ఉండడంలేదనే సాకుతో ఈ–పంట నమోదు, ఫొటోల అప్‌లోడ్‌ బాధ్యతను రైతులకే అప్పగించారు. అలాగే, గతంలో సామాజిక తనిఖీ కింద ఆర్బీకేల్లో ప్రదర్శించిన తర్వాత, గ్రామసభల ద్వారా అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శించే వారు.

అలాంటిది ఇక నుంచి www.karrhak.ap.gov.in/ ecsop, www.africuture.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌ నెంబర్‌తో ఈ–పంట నమోదు వివ­రాలను రైతులే పరిశీలించుకోవడమే కాక.. స్వీయ ధృవీకరణతో పాటు తప్పొప్పులపై ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసుకోవాలని చెప్పారు. అయితే, ఎంతమంది రైతులకు అండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్లున్నాయి? ఎంతమంది రైతులకు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంపై అవగాహన ఉందనేది ఆలోచించకుండా ఈ బాధ్యతను రైతులకు అప్పగించడంపట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

ఈ–క్రాప్‌ స్ఫూర్తిని దెబ్బతీసేందుకే..
ఇక రైతులు తాము ఎంత విస్తీర్ణంలో ఏ పంటసాగు చేయబోతున్నామో ముందుగా సమీప ఆర్బీకే సిబ్బందికి తెలియజేయాలి. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా సీజన్‌ వారీగా ఏ సర్వే నెంబర్‌లో ఏ రైతు ఏయే పంటలు ఏ పద్ధతుల్లో సాగుచేస్తున్నారో జాయింట్‌ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు క్షేత్రస్థాయి పరిశీలనలో నమోదు చేయాలి. అలాగే..

⇒ రైతును పంట పొలం వద్ద నిలబెట్టి ఫొటోలు తీసి జియో కోఆర్డినేట్స్‌తో అప్‌లోడ్‌ చేయాలి. 
⇒ ఆ తర్వాత ఈ వివరాలను ఆర్బీకే, రెవెన్యూ అధికారులు ధృవీకరించి రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకున్నాక మొబైల్‌ ఫోన్లకు మెస్సేజ్‌ పంపాలి. 
⇒ ర్యాండమ్‌గా 5–10 శాతం విస్తీర్ణంలో సా­గైన పంట వివరాలను ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి ధృవీకరించిన తర్వాత రైతులకు భౌతిక రశీదులివ్వాలి. 
⇒ ముసాయిదా జాబితాలను తొలుత సా­మాజిక తనిఖీ కింద ఆర్బీకేల్లో ప్రదర్శించి గ్రామసభల ద్వారా రైతుల అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శించాలి. 

⇒ ఇలా పక్కాగా ఈ–పంట నమోదు జరిగితే ఏదైనా విపత్తు వేళ ఎంత విస్తీర్ణంలో ఏ పంట దెబ్బతిన్నదో క్షణాల్లో గుర్తించొచ్చు. నేరుగా సదరు రైతుకు నష్టపరి­హారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ)తో పాటు పంటల బీమా పరిహారం అందించొచ్చు. పండించిన పంట ఉత్పత్తులను దళారీలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. అలాగే, సాగు­వేళ అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి ఉత్పాదకాలను అందించే అవ­కాశం ఉంటుంది. ఏపీలో అమలుచేసిన ఈ–క్రాప్‌ స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్రం డిజిటల్‌ క్రాప్‌ సర్వే (డీసీఎస్‌)కు శ్రీకారం చుట్టింది. డీసీఎస్‌ నిబంధనల ప్రకారం ప్రతీ ల్యాండ్‌ పార్సిల్‌ను విధిగా నమోదుచేయాలనే నిబంధన ఉంది. ఇది భారం కావడంతో ఈ–పంట నమోదు బాధ్యత నుంచే ప్రభుత్వం తప్పించుకో­వాలన్న ఎత్తుగడ వేస్తున్నట్లు కన్పిస్తోంది.

ఈ–పంట నమోదును నిర్వీర్యం చేశారు
అత్యంత పారదర్శకంగా గత ప్రభుత్వం చేపట్టిన ఈ–పంట నమోదు ప్రక్రియను ప్రస్తుత చంద్ర­బాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. వాస్తవ సాగుదారులైన కౌలుదారుల వివరాలను నమోదు చేయడం లేదు. భూ యజమానుల పేరిట నమోదు చేస్తున్నారు. తాజాగా.. స్వచ్ఛందంగా రైతులకే స్వీయ నమోదుకు అవకాశం ఇవ్వడంవల్ల అవకతవకలు చోటుచేసుకునే అవకాశముంది. – ఎం. హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)