Breaking News

విద్యుత్‌ చార్జీల 'వీర బాదుడు'

Published on Sat, 08/02/2025 - 05:25

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది ఏదైనా ఉందంటే అది కరెంటు బిల్లు మాత్రమే. సామాన్యుల నడ్డి విరిచేలా ఏడాది నుంచి ఏ నెలకానెల విద్యుత్‌ చార్జీల భారం పెరుగుతూనే ఉంది. ఓవైపు ‘సూపర్‌ సిక్స్‌’ అంటూ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు విద్యుత్‌ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వాడకంతో సమానంగా అదనపు చార్జీలను వడ్డిస్తోంది. అది చాలదన్నట్లు తాజాగా రూ.12,771 కోట్ల చార్జీలను వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇదేనా బాబు సంపద సృష్టి?
వెన్నుపోటు పొడవడంలో పేటెంట్‌ తీసుకున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పారు. కానీ, తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టారు. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్లను జోడించారు. 

ఇది చాలదన్నట్లు ఇటీవల మరో రూ.3629.36 కోట్ల చార్జీల బాదుడుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు సమర్పించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి... అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్‌ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) రూ.2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. 

దీనిని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున వేసి వసూలు చేయడం కూడా కూటమి అధికారంలోకి రాగానే మొదలుపెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకు రూ.2,787.19 కోట్లు జనం నుంచి వసూలు చేసేశారు. 

మొత్తం రూ.410.25 కోట్లు ఎక్కువ వసూలు చేయడం గమనార్హ. మరో రూ.842.17 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్‌సీని అనుమతి కోరగా, దానిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయసేకరణ జరుగుతోంది. ఇవన్నీ కలిపితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.19,114.72 కోట్ల భారం ప్రజల నెత్తిన మోపినట్లైంది. ఈ నేపథ్యంలోనే ‘‘ఇదేనా సంపద సృష్టి’’ అని ప్రజలు నిలదీస్తున్నారు.

జనం సొమ్ముతో రూ.12,771 కోట్ల లోటు భర్తీ
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్‌ రూ.7,790.16 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌ రూ.1,935.29 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.3,046.51 కోట్ల చొప్పున లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్‌సీకి తాజాగా సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. 

ఈ మొత్తాన్ని విద్యుత్‌ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతివ్వాలని కమిషన్‌ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్‌ ప్రజలు తమ అభ్యంతరాలను ఆగస్టు 14వ తేదీలోగా ఈ మెయిల్‌ ద్వారా తెలియజేయాలని సూచించింది. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 29లోగా డిస్కంలు బదులివ్వాలని ఆదేశించింది. 

ఇప్పటికే వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కనికరం లేకుండా ప్రభుత్వం చార్జీలు పెంచుతూనే ఉంది. నిజానికి డిస్కంల లోటు ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించడం పరిపాటి. కానీ, దానిని కూడా ప్రజల సొమ్ముతోనే భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుండడం అన్యాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గ చార్జీలపై వ్యతిరేకంగా పోరాటానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)