Breaking News

పెట్టుబడుల్లో ‘టెక్‌’నిక్‌!

Published on Sat, 11/15/2025 - 05:33

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఊరూపేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో అడ్డగోలుగా భూములు దోచిపెడదామనుకున్న వ్యవహారంలో ఆధారా­లతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త పంథాలో వెళుతోంది. ఇప్పటికే కార్యకలా­పాలు నిర్వహిస్తున్న కంపెనీలకు కొత్తగా భూ కేటాయింపులు చేస్తూ.. కొత్త కంపెనీ వస్తోందంటూ ఊదరగొడుతోంది. విశాఖపట్నం జిల్లా బక్క­న్న­పాలెంలోని 80 ఫీట్‌ రోడ్డులోని ఈశ్వర్‌­సాయి ఎన్‌క్లేవ్‌లో సెయిల్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కార్యకలా­పాలు నిర్వహిస్తోంది. గతంలో ఇదే కంపెనీ విశాలా­క్షినగర్‌లో ఉండేది.

అక్కడి నుంచి బక్కన్నపాలేనికి మారింది. ఐటీ హిల్స్‌లో కూడా ఈ కంపెనీ కార్యా­లయం ఉంది. అయితే, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి ఐటీ హిల్స్‌–3లో మంత్రిలోకేశ్‌ స్వయంగా భూమి పూజ చేశారు. అంతేకా­కుండా ఇది కొత్త కంపెనీ అంటూ ఊదరగొడు­తున్నారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు వైజాగ్‌ చేరుకున్న లోకేశ్‌.. ముందస్తు ఒప్పందాలంటూ హడావుడి చేశారు. గురువారం ఐటీ హిల్స్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా సందడి కనిపించేందుకు గీతం కాలేజీకి చెందిన విద్యార్థులకు సూట్స్‌ వేసి మరీ కార్యక్రమానికి తరలించారనే విమర్శలున్నాయి.

విలువైన భూములు కట్టబెట్టేందుకే..
‘శ్రీ తమ్మిన సొల్యూషన్స్‌’ పేరుతో విశాఖ శంకర­మఠం రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్‌ తమ్మిన సొల్యూషన్స్‌ది కూడా ఇదే కథ. ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పని చేస్తున్నది కేవలం 500 మంది లోపు ఉద్యోగులే. అయితే, రానున్న ఐదేళ్లలో కేవలం ఏపీలోని పెట్టుబడుల ద్వారానే 2వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. 

2005లో ఏర్పడిన ఈ కంపెనీ రెండు దశాబ్దాలుగా కల్పించిన ఉద్యో­గాల కంటే నాలుగు రెట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఈ కంపెనీకి ఇప్పుడు ఐటీ హిల్స్‌–2లో భూమిని కేటాయించడమే కాకుండా, భారీగా ఉపాధి లభిస్తుందంటూ లోకేశ్‌ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్న కొన్ని కంపెనీలకు విలువైన భూములను తక్కువ ధరకు అప్పగించేందుకు ఈ నాటకాలను తెరమీదకు తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతు­న్నాయి.

ఒకవైపు 99 పైస­లకే ఎకరా భూమి అంటూ వైజాగ్‌లోని విలువైన భూములను ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. పెద్దగా ఉపాధి కల్పించని కంపెనీలకు కూడా భారీగా భూ సంతర్పణ చేస్తోంది. అప్పనంగా భూములు అప్పగించడానికి, విశాఖలో భారీగా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ ప్రచారం చేసుకునేందుకే వీలుగా ఈ వ్యవహారాలు సాగిస్తున్నారనే విమర్శలున్నాయి.

విశాఖ జిల్లా బక్కన్నపాలెంలో చాలాకాలంగా కొనసాగుతున్న సెయిల్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇది.. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)