Breaking News

అప్పుల్లో చంద్రబాబు సర్కార్‌ రికార్డు

Published on Tue, 05/06/2025 - 13:37

అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది.  గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.

మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.

ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు

 

 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)