Breaking News

వాణిజ్య ప్రతినిధులకు చుక్కెదురు!

Published on Sat, 11/15/2025 - 05:28

సాక్షి, విశాఖపట్నం: లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగాలంటూ అంకెల గారడీతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వాణిజ్య ప్రతినిధుల విషయంలోనూ అదే వైఖరి ప్రదర్శించింది. తమ వాణిజ్య, వ్యాపారాల్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొంత మంది పారిశ్రామికవేత్తలకు భాగస్వామ్య సదస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ–బీ) సెషన్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. 

'ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రూ.3,500 నుంచి రూ.10,500 వరకు ఫీజు వసూలు చేశారు. దాదాపు 200 మంది వరకు బీ–బీలో రిజి్రస్టేషన్‌ చేసుకున్నారు. ఒక్కొక్కరు 8 నుంచి 10 మంది బిజినెస్‌ ప్రతినిధులతో బీ–బీ సెషన్‌లో మాట్లాడుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. తీరా భాగస్వామ్య సదస్సుకు వచ్చిన తర్వాత.. సీన్‌ మొత్తం రివర్స్‌ అయిపోయింది. ఇక్కడికొచ్చేసరికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతినిధులు విస్తుపోయారు. 

సమస్యలుంటే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పి.. సదస్సు ప్రారంభమయ్యే సమయానికి వెబ్‌సైట్‌నే మూసేశారు. దీంతో కొందరు వాణిజ్యవేత్తలు బీ–బీపై నిర్వాహకులను నిలదీశారు. ‘వెబ్‌సైట్‌ క్లోజ్‌ అయిపోయింది.. ఏమీ అనుకోవద్దు.. మీకోసం ఏర్పాటు చేసిన సెషన్‌ హాల్‌లో కూర్చోండి’ అంటూ తాపీగా సమాధానం చెప్పి జారుకున్నారు. 200 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అక్కడ మాత్రం కేవలం 20 టేబుల్స్‌.. ఒక్కో టేబుల్‌ దగ్గర నాలుగు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. 

అవి కూడా మరుగుదొడ్ల పక్కనే ఏర్పాటు చేయడంతో వచ్చినవారు కూడా ఇబ్బందులు పడ్డారు. జామర్ల కారణంగా ఇంటర్నెట్‌ కూడా పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా వైఫై క్యూఆర్‌ కోడ్‌లు ఇచ్చారు. వాటిని స్కాన్‌ చేస్తే ఎర్రర్‌ రావడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పారిశ్రామికవేత్తలు అసహనం వ్యక్తం చేస్తూ తిరిగి వెళ్లిపోయారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)