Breaking News

యనమలకు బాబు ‘షాక్’ హ్యాండ్‌

Published on Tue, 03/11/2025 - 05:55

సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఆవిర్భా­వం నుంచి ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీ­యాల నుంచి అవమానకరంగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సమకాలీకుడు, ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని లాక్కునేందుకు స్పీకర్‌గా అన్ని విధాలా సహకరించిన సహచరుడు.. యనమలను పట్టించుకోకుండా చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరుతో యనమల ఎమ్మెల్సీ పదవికి గడువు ముగియనుండగా, ఆయన సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేయలేదు. 

ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలే ఆయన పాల్గొంటున్న చివరి సమావేశాలుగా చెబుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌తో పొసగకపోవడం, ఆయన కోటరీని వ్యతిరేకించడం వల్లే యనమలను పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. మున్ముందు రాజకీయంగా ఆయనకు ఎటువంటి పదవులు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన రిటైర్‌ అయినట్లేనని స్పష్టం చేస్తున్నాయి. 

పార్టీ కోసం సుదీర్ఘకాలం పని చేసిన వ్యక్తికి ఇంత అవమానకరంగా రాజకీయ ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించలేదంటున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్‌ చేయకపోవడంపై యనమల స్పందించకపోయినా తనను కావాలని అవమా­నించినట్లు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది.  

కూతురు, అల్లుడికి పదవులు ఉన్నాయనే కారణంతో పక్కకు.. 
టీడీపీలో ప్రస్తుతం లోకేశ్‌ మాటే శాసనంగా నడుస్తుండడంతో ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన కుమార్తె తుని ఎమ్మెల్యేగా, అల్లుడు ఏలూరు ఎంపీగా ఉండడంతో ఇక ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు సైతం భావించినట్లు ప్రచా­రం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా లేకపోయినా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా చేసి ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. 

అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవ­కాశం ఇవ్వాలని కోరినా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటానని మంత్రి పదవి ఇచ్చారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అయితే అంతకుముందు నుంచే పార్టీలో లోకేశ్‌ పెత్తనం పెరిగిపోవడం, దాన్ని యనమల వంటి పలువురు సీనియర్లు వ్యతిరేకించడంతో చినబాబు ఆగ్రహానికి గురై, వారి  ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో యనమలకు పూర్తిగా చెక్‌ పెట్టి రాజకీయాల నుంచే అనివార్యంగా రిటైర్‌మెంట్‌ ఇప్పించారనే చర్చ జరుగుతోంది.

పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఇటీవల ఆయన కాకినాడ పోర్టు, సెజ్‌ వ్యవహారంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. కాకినాడ పోర్టు యజమానిగా ఉన్న కేవీ రావు పేదల భూములు తీసుకుని అక్రమంగా సంపాదించారని, అలాంటి వారిని వెనకేసుకురావడం ఏమిటని ప్రశ్నిoచారు. యనమల స్థాయి నాయకుడు ఏకంగా సీఎంని ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. 

అయితే చంద్రబాబు తన మార్కు రాజకీయంతో పార్టీలోనే యనమల వ్యతిరేకుల్ని, సోషల్‌ మీడియాను ప్రోత్సహించి ఆయనపై ఎదురుదాడి చేయించడంతోపాటు అసభ్యంగా తిట్లు కూడా తిట్టించారు. అప్పటి నుంచి టీడీపీకి, యనమలకు మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది.   

వాడుకుని వదిలేయడం బాబుకు అలవాటే 
ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లోనూ యనమలకు కనీస ప్రాధాన్యం లభించడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మండలిలో లోకేశ్‌ ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా యనమల దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు సైతం టీడీపీ సభ్యులు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా అవసరానికి వాడుకుని ఆ తర్వాత పూచికపుల్లలా తీసిపడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటైన విద్యే. కాబట్టి యనమలకు అదే తరహా ట్రీట్‌మెంట్‌ లభించిందని విశ్లేషకులు చెబుతున్నారు.    

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)