Breaking News

‘మద్యం’ కేసులో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

Published on Wed, 11/22/2023 - 05:20

సాక్షి, అమరావతి: ‘మద్యం’ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధ­వారానికి వాయిదా వేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా వారి పార్టీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఖజానాకు రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనిపై సీఐడీకి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనరేష్, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర, శ్రీనరేష్‌ హై­కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. చంద్ర­బాబు, రవీంద్రల వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకా­ణాలు, బార్లకు శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్‌ ఫీజు తొలగించినట్లు చెప్పారు. ఇందుకు గవర్నర్‌ సైతం ఆమోదముద్ర వేశారన్నారు. ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తూ ఎక్సైజ్‌ చట్టానికి చేసిన సవరణకు అప్పటి మంత్రి మండలి ఆమోదం కూడా ఉంద­న్నారు.

రాజ్యాంగంలోని అధికరణ 163 (3) ప్రకా­రం గవర్నర్‌కు మంత్రులు చేసిన సూచనలపై న్యాయ సమీక్ష కుదరదని అన్నారు. రాజ­కీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశార­న్నారు. కొల్లు రవీంద్ర తరఫున సీని­యర్‌ న్యాయ­వాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. కాగా, ముందస్తు బెయిల్‌ కోసం శ్రీనగేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచార­ణను జస్టిస్‌ మల్లికార్జున­రావు ఈ నెల 28కి వాయిదా వేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)