Breaking News

Babu Arrest : బాబు పాపం పండింది, శిక్ష ఖాయం : డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

Published on Sat, 09/09/2023 - 13:20

నూరు పాపాలు చేసిన చంద్రబాబు.. ఎట్టకేలకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయ్యారుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబును అభినవ శిశుపాలుడిగా అభివర్ణించిన మంత్రి కొట్టు.. చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని అంతా దోచుకోడానికే ఉపయోగించుకున్నారని, ప్రజాధనం వేల కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. మనీ లాండరింగ్‌ ద్వారా విదేశాలకు అక్రమమార్గంలో తరలించారని ధ్వజమెత్తారు.

మరిది కోసం వదిన పోరాటమా?
రెండెకరాలతో రాజకీయాలను ప్రారంభించిన చంద్రబాబు ఇవ్వాళ లక్ష కోట్లకు ఎదిగాడని, తన పదవులను అడ్డు పెట్టుకోని కోట్లాది రుపాయలను అక్రమంగా సంపాదించారని మండిపడ్డారు. చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారంటూ పురందేశ్వరీ చేసిన ట్వీట్‌ హస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ మూడు సార్లు నోటీసు ఇచ్చినప్పుడు కూడా పురందేశ్వరీ ఖండించినట్టు భావించాల్సి ఉంటుందన్నారు. బీజేపీలో ఉంటూ, కేంద్ర ప్రభుత్వం నోటీసులిస్తే కూడా పురందేశ్వరీ.. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చంద్రబాబును వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు.

దత్తపుత్రుడికి మెలకువ వచ్చిందా?
చంద్రబాబు అరెస్ట్‌ కాగానే.. జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు ఖండించడం హస్యాస్పదమని ఎద్దేవా చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసుకు సంబంధించి సిఐడి పూర్తి ఆధారాలు సేకరించిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు మూడు సార్లు నోటీసులిస్తే.. స్పందించని పవన్‌ కళ్యాణ్‌కు హఠాత్తుగా ఇప్పుడు మెలకువ వచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు ఉందని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌.. చంద్రబాబుకు కేంద్రం నుంచి నోటీసులిచ్చినా.. దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేస్తుంటే.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌... ఏ ఒక్కరికీ సింగిల్‌గా పోటీ చేసే దమ్ములేదన్నారు.

పాదయాత్రలో దండయాత్రనా?
నారా లోకేష్ గుండాలను వెనుక వేసుకుని పాదయాత్ర పేరుతో దాడులు చేస్తున్నాడు. రక్తపాతం, మారణకాండ సృష్టిస్తున్నాడు.  బ్యానర్ కనిపిస్తే చాలు వాటిని చింపేయమని అడిస్తున్నాడు. ఇదేంటని అడ్డుకుంటే వాళ్ళని రాళ్లు, కర్రలతో దాడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో నారా లోకేష్ పాదయాత్ర చూస్తే అర్ధమవుతుంది. 2014 నుంచి 2019 వరకు మేము చేసిన పరిపాలన చూసి మాకు ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబు కి, నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ గాని ఉందా? అని మండిపడ్డారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)