Breaking News

హామీలిచ్చా.. అప్పులున్నాయిగా..

Published on Sat, 08/10/2024 - 05:25

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చానని, కానీ, రాష్ట్రానికి ఉన్న రూ.10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి కులాన్ని అధ్యయనం చేస్తున్నానని, వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నానని అన్నారు. ఆయన శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. అడవి తల్లికి ఆదివాసీ చీరను సమర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశ ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్‌ అంబాసిడర్‌ చేశానని చెప్పారు. 

దేశంలోని ప్రతి షాపులో అరకు కాఫీ అమ్మేలా చేస్తానన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గుతోందని, గిరిజ­నుల్లో మాత్రం సంతానం పెరగడం శుభపరిణా­మమని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఏజెన్సీలో డోలీ మోతలు విచారకరమని అన్నారు. డీఎస్సీకి పోటీ పడే గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. లంబసింగిలో మ్యూజియం, పాడేరులో మెడికల్‌ కళాశాల రూ.500 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పారు. 

పాడేరులో రూ.10 కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తామని, కుళాయి ద్వారా నీళ్లు అందిస్తామని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపించారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సుడిగాలిలో జగన్‌ కొట్టుకుపోయాడని, ఇక తిరిగి రాడని చంద్ర­బాబు అన్నారు. టీడీపీ హయాంలో తెచ్చిన 16 పథకాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు ద్వారా మీ భూములను దోచుకోవాలని చూశారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు కసరత్తు
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీచేసే విషయంపై సీఎం చంద్ర­బాబు పార్టీ నేతలతో చర్చించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆ జిల్లా నేతలతోపాటు పలువురు పార్టీ సీనియర్లతో మాట్లాడారు. పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. 

నేతలు చెప్పిన లెక్కల ప్రకారం గెలవడానికి సరిపోయే సంఖ్య లేదని తెలిసింది. అందుకే అభ్యర్థిని ఖరారు చేయకుండా సాగదీస్తున్నట్లు సమాచారం. పోటీ చేయాల్సివస్తే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)