Breaking News

కూటమిలో తేలని ‘పదవుల’ పంచాయితీ

Published on Sat, 08/17/2024 - 05:34

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్డీఏ కూటమిలో నామినేటెడ్‌ పదవుల పంపకం ఎటూ తేలడంలేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఒక్క నామినేటెడ్‌ పదవిని కూడా సీఎం చంద్రబాబు భర్తీ చేయలేదు. అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), ఏపీఐఐసీ, ఆర్టీసీ వంటి కార్పొరేషన్‌ పదవులు సైతం ఇంకా ఎవరికీ ఇవ్వకపోవడంతో మూడు పార్టీల శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. 

ప్రధానంగా టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సహజంగానే నాన్చుడు ధోరణి ప్రదర్శించే చంద్రబాబు ఇప్పుడు కూటమిలో మూడు పార్టీల మధ్య పదవుల పంపకం జరగాల్సి ఉండటంతో మరింత తాత్సారం చేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఏ నిష్పత్తిలో పదవులు ఇవ్వాలనే దానిపై ఒక అవగాహన కుదిరినా ఆశావహులు ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్ర స్థాయిలో 90కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల పదవులు వందల సంఖ్యలో ఉన్నాయి. మొత్తం పదవుల్లో 70 శాతం టీడీపీకి, 25 శాతం జనసేనకు, 5 శాతం బీజేపీకి కేటాయించాలనే ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. తొలి విడతగా వాటిలో 30 శాతం పదవులనైనా భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నా పార్టీలు, సమీకరణలు, లాబీయింగ్‌తో గందరగోళం ఏర్పడి ఇప్పటివరకు ఒక్క పదవినీ భర్తీ చేయలేకపోయారు. నియోజకవర్గాలకు సంబంధించిన పదవుల్లో గెలిచిన ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.  

టీటీడీకి తీవ్ర పోటీ 
అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్‌ పదవిపై కూటమిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్‌ పదవిని టీడీపీకి కేటాయించుకున్నా దాన్ని ఎవరికి ఇవ్వాలనే దానిపై చంద్రబాబు ఎటూ తేల్చలేకపోతున్నారు. ఎల్లో మీడియాకి చెందిన ఓ ఛానల్‌ యజమానికి ఈ పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే అంత ప్రాధాన్యత ఉన్న పదవిని పార్టీకి చెందిన వారికి కాకుండా బయటి వ్యక్తులకు ఎలా ఇస్తారనే అభ్యంతరాలు టీడీపీ నుంచి వచ్చినట్లు తెలిసింది. దీంతో సీనియర్‌ నేత కళా వెంకట్రావు పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎల్లో మీడియా తరఫున ఓ ఛానల్‌ అధినేతకు చంద్రబాబు మాట ఇచ్చేశారని, ఆయనకే టీటీడీ ఛైర్మన్‌ పదవి లభిస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుల పదవుల కోసం కూడా విపరీతమైన పోటీ నెలకొంది. 

ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి కూడా బోర్డు సభ్యత్వం కావాలని వినతులు వచ్చాయి. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యులు, ఇతర రాష్ట్రాల పెద్దల నుంచి బోర్డు మెంబర్ల కోసం సిఫారసులు రావడంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. అయితే జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నుంచి కూన రవికుమార్, వేమిరెడ్డి ప్రశాంతికి బోర్డు సభ్యులుగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ప్రచారంలో ఉన్న పేర్లు ఇవే? 
ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం సీటును వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కి పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ పేర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. తెనాలి సీటు వదులుకున్న ఆలపాటి రాజాకి కీలకమైన పదవి దక్కుతుందని సమాచారం.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)