Breaking News

‘పంతం’ నెగ్గింది.. నిందితుల వైపే కూటమి సర్కారు

Published on Wed, 09/25/2024 - 05:50

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడలో దళిత వైద్యుడిపై దాడి ఘటనలో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్‌ కాలేజీ దళిత ప్రొఫెసర్‌ వివాదాన్ని కంచికి చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్, ఫోరెన్సిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ పి.ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలిచింది. ఈ ఘటనపై నాలుగు రోజుల్లో నాలుగు మలుపులు తిరుగుతూ వచ్చింది. 

ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బూతు పురాణం విప్పి దాడి చేయడం, అనుచరుల దౌర్జన్యం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. దళిత వైద్యుడిపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అన్నివర్గాలూ ముక్తకంఠంతో ఖండించాయి. 

ఆదినుంచీ అదే ప్రయత్నం 
వివిధ వర్గాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో కూటమి పెద్దలు తెరవెనుక చక్రం తిప్పి కేసును రాజీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఘటన జరిగిన రోజున కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి, ఎస్పీ విక్రాంతపాటిల్‌ నేరుగా రంగంలోకి దిగారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వారు చొరవ తీసుకున్నారని అంతా భావించారు. కానీ.. ఈ వ్యవహారంలో దగ్గరుండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. 

ఘటన జరిగిన రోజు రాత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్‌ నరసింహం ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం తొక్కిపెట్టడం విమర్శల పాలైంది. ప్రిన్సిపాల్‌ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా వైద్యుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీస్‌ యంత్రాంగం మొదటినుంచీ చేస్తున్న ప్రయత్నంగానే కనిపించింది. 

ప్రాయశ్చిత దీక్ష చేస్తే సరిపోతుందా? 
అధికారం ఉంది కదా అని అన్యాయంగా ఒక దళిత వైద్యుడిని బూతు పురాణంతో దారుణంగా అవమానించి చంపేస్తానంటూ దాడికి దిగిన ఎమ్మెల్యే నానాజీ నాటకీయంగా క్షమాపణలు చెప్పి.. ప్రాయశ్చితమంటూ దీక్ష చేస్తే సరిపోతుందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని వైద్యవర్గాలు ఆక్షేపిస్తున్నాయి. చివరకు కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో పోలీస్‌ యంత్రాంగం కేసు తీవ్రతను తగ్గించి ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులకు కొమ్ముకాసిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. 
 


బెయిల్‌బుల్‌ సెక్షన్లతో సరి 
చివరకు ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కూటమి ప్రభుత్వం బెయిల్‌బుల్‌ సెక్షన్లతో కేసు నమోదు చేసి తీవ్రతను తగ్గించేసింది. సెక్షన్‌ 292 బీఎన్‌ఎస్‌ (భారత న్యాయసంహిత) పబ్లిక్‌ న్యూసెన్స్‌ (రూ.200 జరిమానా), 115(2) బీఎన్‌ఎస్‌ స్వల్ప గాయాలు, చేతులతో కొట్టడం (ఏడాది జైలు, రూ.1,000 జరిమానా) 351 బీఎన్‌ఎస్‌ వ్యక్తి పరువు తీయడం, శారీరకంగా, మానసికంగా బెదిరించడం (126(2) రెడ్‌విత్‌ 3(5) బీఎన్‌ఎస్‌ ప్రకారం నెల జైలు, రూ.500 జరిమానా) వంటి సెక్షన్లతో సరిపెట్టారు. 

ఎమ్మెల్యే నానాజీ మరో 10 మందిపై నమోదు చేసిన ఈ సెక్షన్లన్నీ బెయిల్‌కు అవకాశం ఉన్నవే కావడం గమనార్హం. దళితుడైన వైద్యుడిని తీవ్రంగా అవమానించి.. చంపేస్తానని బెదిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసినా ప్రభుత్వ ఒత్తిడితో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా బెయిల్‌కు అవకాశం ఉన్న సెక్షన్లతో కేసును నీరుగార్చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)