Breaking News

ఆర్టీసీపై పీపీపీ పిడుగు

Published on Sun, 06/14/2026 - 05:04

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)పై ప్రై‘వేటు’కు చంద్ర­బాబు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడు­తోంది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్‌ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవే­టీకరించే కుట్రలో ఒక్కో అంకాన్ని వేగవంతం చేస్తోంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలా­లను దెబ్బ­­తీస్తూ ఆర్టీసీని దివాలా తీయించేందుకు సిద్ధ­పడు­తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్‌ స్టేషన్ల భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి, సొంత ఆస్తులను అన్యా­క్రాంతం చేసి.. అనంతరం ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, బస్‌ డిపోలే ఆర్టీసీకి ప్రాణాధారం. 

ఆ ఆయువుపట్టుపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఇ–బస్సుల విధానం ముసుగులో రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఆ కుతంత్రంలో రెండో అంకానికి తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ఆర్టీసీ బస్‌ స్టేషన్ల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కార్యాచరణకు ఉపక్రమించింది. పబ్లిక్‌ –ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో అందుకు సిద్ధపడింది. ప్రభుత్వ పెద్దల అత్యంత ముఖ్యులకే బినామీ పేర్లతో, బినామీ సంస్థల ముసుగులో కట్టబెట్టేందుకు ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. అందుకోసం మొదటి దశలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, విజయవాడ ఆటోనగర్, తిరుపతి, గుంటూరు, కడప, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు బస్‌ స్టేషన్లను గుర్తించింది.

రూ.వేల కోట్ల భూములను కారు చౌకగా కట్టబెట్టే కుట్ర 
⇒ అత్యంత విలువైన ఆర్టీసీ బస్‌ స్టేషన్లను పీపీపీ విధానంలో కారు చౌకగా తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. అత్యంత విలువైన ఆ ప్రాంతంలో మార్కెట్‌ ధర ఎకరం రూ.200 కోట్ల పైమాటే. ఆ ప్రకారం ఆ 12 ఎకరాల మార్కెట్‌ విలువ రూ.2,400 కోట్లు పలుకుతుంది. కానీ ఆ బస్‌ స్టేషన్‌ను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుందని డీపీఆర్‌ను ప్రతిపాదించడం గమనార్హం. అంటే రూ.500 కోట్ల పెట్టుబడి పెడతామనే ఓ ప్రైవేటు సంస్థకు రూ.2,400 కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం తెగబడుతోందన్నది స్పష్టమవుతోంది. 

⇒ అదే రీతిలో ఇతర బస్‌ స్టేషన్లను పీపీపీ విధానంలో కట్టబెట్టేందుకు ప్రైవేటు సంస్థల పెట్టుబడి కోసం డీపీఆర్‌ను అడ్డగోలుగా రూపొందించడం గమనార్హం. తిరుపతి బస్‌ స్టేషన్‌కు రూ.300 కోట్లు, విజయవాడ ఆటోనగర్‌ బస్‌ స్టేషన్‌కు రూ.150 కోట్లు, గుంటూరు బస్‌ స్టేషన్‌కు రూ.60 కోట్లు పెట్టుబడి పెడతారనే పేరుతో తమ అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 

విజయవాడలోని ఆటోనగర్‌ బస్టాండ్‌ 

⇒ కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం బస్‌ స్టేషన్ల భూములను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేవలం నామమాత్రపు లీజుతో ఈ భూములను ధారదత్తం చేసేందుకు ప్రతిపాదనలు ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశించినట్టు తెలుస్తోంది. 

⇒ మొత్తం మీద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు  సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం బరితెగిస్తోందని మండిపడుతున్నాయి.   

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)