Breaking News

పండుగ పూట కూటమి సర్కార్‌ దగా

Published on Mon, 01/13/2025 - 11:43

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి పాలనలో ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు దగా చేస్తూనే ఉన్నారు. తాజాగా సంక్రాంతి పండుగ వేళ కూడా ప్రజలకు చేదు అనుభవమే మిగిలింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేళ ప్రజలను దగా చేశారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి మంగళం పాడారు. ప్రతీ ఏటా సంక్రాంతి కానుక సరుకులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అందుకు విరుద్దంగా తొలి సంక్రాంతికి కూడా చంద్రబాబు ప్రభుత్వం కానుక ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో మాత్రం సంక్రాంతి కానుక ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు.

మరోవైపు.. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం  పండగ వేళ మోసం తప్పలేదు. తాము గెలిచి కూటమి అధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చాక మాత్రం ఉద్యోగులను తీవ్రంగా మోసం చేశారు. కూటమి సర్కార్‌ ఏర్పాటై.. ఏడు నెలలు అవుతున్నా ఐఆర్‌ మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం​. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. దీంతో.. ప్రజలు, ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)