నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
Published on Sun, 04/13/2025 - 17:10
సాక్షి, గుంటూరు: అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. 44,676 ఎకరాలను సీఆర్డీఏ సమీకరించనుంది. మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వం మళ్ళీ సమీకరించనుంది. ఇప్పటికే 54 వేల ఎకరాలు సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. 54 వేల ఎకరాల్లో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు.
గత ఆ భూములు ఉంటుండగానే మళ్లీ 44,676 ఎకరాలు భూముల సమీకరణకు సిద్ధమైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో కొత్తగా భూ సమీకరణ చేయనుంది. 11 గ్రామాల్లో 44,676 ఎకరాలు భూములను ప్రభుత్వం సమీకరించనుంది.
కాగా, రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు భూములు కాజేసిన సంగతి తెలిసిందే. ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు.
రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్దలైంది. అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
Tags : 1