Breaking News

సర్కారు నిర్లక్ష్యానికి మరో ‘ఆశ్రమ’ విద్యార్థిని బలి

Published on Sat, 01/17/2026 - 05:25

పెదబయలు(అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు అధికారం చేపట్టాక ఆశ్రమ పాఠశాలల్లో మరణమృదంగం మోగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరుసగా విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. కారణాలు అన్వేషించి మరణాలకు అడ్డుకట్ట వేయడం లేదు. ఫలితంగా మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బలైంది. పండగ రోజే తీవ్ర అనారోగ్యానికి గురై సకాలంలో వైద్యం అందక మరణించింది. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలి్చంది. పెదబయలు మండలం సీకరి పంచాయతీ కౌరుపల్లి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన పండగ వేళ పెను విషాదం నింపింది. విద్యార్థిని తల్లిదండ్రులు కొర్రా భాస్కరరావు, లక్ష్మి దంపతుల కథనం ప్రకారం..  కొర్ర పూజిత(14) పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 8న సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది.

గొంతులో నొప్పి, దగ్గు వస్తోందని చెప్పడంతో 10న తల్లిదండ్రులు పెదబయలు పీహెచ్‌సీకి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. హెచ్‌బీ 6.2 ఉందని, మందులు ఇచ్చారు. ముంచంగిపుట్టు ఏరియా ఆస్పతికి వెళ్లాలని సూచించడంతో అక్కడ మళ్లీ పరీక్షలు చేసి తేడా ఏమీలేదని చెప్పారు. దీంతో పూజితను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. ఈ నెల 14న పూజితకు గొంతు నొప్పి ఎక్కువైంది. శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అయితే రెండుగంటలు పడుతుందని సిబ్బంది సమాధానం చెప్పారు.  దీంతో ఎంపీటీసీ ద్వారా తల్లిదండ్రులు 108కి ఫోన్‌ చేయించారు. గంటలో వస్తామని సిబ్బంది బదులివ్వడంతో నిరీక్షించారు.

ఎంతకూ 108 రాకపోవడంతో ఆటోలో 8 కిలోమీటర్ల దూరంలోని పెదబయలు పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి వెంటనే పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని రిఫర్‌ చేశారు. అక్కడ కూడా 108 అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆస్పత్రి సిబ్బంది పీహెచ్‌సీ అంబులెన్సులో పూజితను తరలించారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించి పూజిత మరణించింది. 108 అంబులెన్సు సకాలంలో వచ్చి ఉంటే పూజిత ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా చూసుకున్న బిడ్డ ఇలా వైద్యం అందక బలైపోతుందని ఊహించలేదని గుండెలవిసేలా రోదించారు.
 పాఠశాలలో ఆరోగ్యంగానే ఉంది..

ఈ విషయంపై గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల హెచ్‌ఎం చిట్టమమ్మను సాక్షి వివరణ కోరగా పాఠశాలలో ఉన్నప్పుడు ఆరోగ్యంగానే ఉండేదని తప్పించుకున్నారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి సత్యశ్రీని అడగ్గా గొంతులో ఇన్‌ఫెక్షన్‌ ఉందని, అయితే తల్లిదండ్రులు ఆస్పత్రిలో వైద్యం చేయించకుండా ఇంటి వద్ద పసరు వేయించి జాప్యం చేశారని, అందువల్లే పరిస్థితి విషమించిందని చెప్పుకొచ్చారు. అయితే తొలుత ఆస్పత్రికి వచ్చినప్పుడు సరైన వైద్యం అందించాలి కదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 108 సకాలంలో వచ్చి ఉంటే తమ బిడ్డ బతికేదని పేర్కొంటున్నారు. అధికారులు, సర్కారే తమ కుమార్తె మరణానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)