Breaking News

‘కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌’లకు రెడ్‌బుక్‌ కుట్ర బాధ్యతలు!

Published on Thu, 08/14/2025 - 07:40

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ కుట్రలకు అడ్డగోలుగా వ­త్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అ­వకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కా­రు స­న్నద్దమవుతోంది. అందుకోసం క్యాడ­ర్‌ ఐపీఎ­స్‌ అ­ధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్‌­ఫ­ర్డ్‌ ఐపీఎస్‌’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.  

రెడ్‌బుక్‌ కుట్ర కేసులతో ఐపీఎస్‌లు బెంబేలు.. 
టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్‌బుక్‌ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్‌ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్‌ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్‌ ఐపీఎస్‌లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.

సీఐడీ ఐజీగా ఉన్న వినీత్‌ బ్రిజ్‌లాల్‌ రెడ్‌బుక్‌ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్‌ సిద్ధార్థ్‌ కౌశల్‌ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్‌బుక్‌ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు.  

అస్మదీయ కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌లతో రెడ్‌బుక్‌ కుట్ర.. 
చంద్రబాబు ప్రభు­త్వం మ­రో ఎత్తుగడకు తెర­తీసింది. తమ­కు అస్మదీయులైన కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ల ద్వారా రెడ్‌బుక్‌ కుట్రను తీవ్రతరం చేయా­లని భావిస్తోం­ది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తిరుపతి ఆర్‌ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్‌ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఉన్న రామ్మోహన్‌రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.

కరీముల్లా షరీఫ్‌ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్‌రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అ«­దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్‌ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందు­కు వీలుగా క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.  

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)